Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Tirupati

బాలికలపై అసభ్య ప్రవర్తన.. వ్యక్తిపై కేసు నమోదు

Punnami Newsroom Published:
బాలికలపై అసభ్య ప్రవర్తన.. వ్యక్తిపై కేసు నమోదు

Story highlights

  • చిట్వేల్ మండలంలో పాఠశాల సమీపంలో నివాసం ఉండే ఓ వ్యక్తిపై బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
  • పోలీసుల వివరాల ప్రకారం..
  • పాఠశాల సమీపంలో నివాసం ఉండే నాగిసెట్టి వెంకట సుబ్బయ్య (60) అనే వ్యక్తి చాక్లెట్లు ఇస్తానని బాలికలకు ఆశ చూపి తన ఇంటి వద్దకు పిలిపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

చిట్వేల్ మండలంలో పాఠశాల సమీపంలో నివాసం ఉండే ఓ వ్యక్తిపై బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. పాఠశాల సమీపంలో నివాసం ఉండే నాగిసెట్టి వెంకట సుబ్బయ్య (60) అనే వ్యక్తి చాక్లెట్లు ఇస్తానని బాలికలకు ఆశ చూపి తన ఇంటి వద్దకు పిలిపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ శరీరంలోని సున్నితమైన భాగాలను తాకినట్లు ఆరోపణలు వచ్చాయి. పాఠశాలలో బాలికలకు నిర్వహించిన గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అవగాహన కార్యక్రమంలో బాలికలు తమకు ఎదురైన విషయాన్ని ఉపాధ్యాయురాలి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఉపాధ్యాయురాలు బాలికల తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు తెలిసింది. తల్లిదండ్రుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు చిట్వేల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. బాలికల భద్రతకు సంబంధించి పాఠశాలల్లో నిర్వహించే అవగాహన కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు అనుచిత ప్రవర్తనను గుర్తించి, వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై విచారణ కొనసాగిస్తున్నారు. బాధిత బాలికల పేర్లు, గ్రామ వివరాలను వెల్లడించలేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *