Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Tirupati

*కోటలో 20 రోజులుగా పైప్‌లైన్ లీకేజీ.. అధికారుల నిర్లక్ష్యం* *నీరు వృథాగా పోతున్నా పట్టించుకోని వైనం* *మురికితో కలిసిన నీటితో కలుషితమవుతున్న పరిస్థితి* } { *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 19 కోట మండలం,* }

Punnami Newsroom Published:
*కోటలో 20 రోజులుగా పైప్‌లైన్ లీకేజీ.. అధికారుల నిర్లక్ష్యం* *నీరు వృథాగా పోతున్నా పట్టించుకోని వైనం* *మురికితో కలిసిన నీటితో కలుషితమవుతున్న పరిస్థితి* } { *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 19 కోట మండలం,* }

*కోటలో 20 రోజులుగా పైప్‌లైన్ లీకేజీ.. అధికారుల నిర్లక్ష్యం*

*నీరు వృథాగా పోతున్నా పట్టించుకోని వైనం*

*మురికితో కలిసిన నీటితో కలుషితమవుతున్న పరిస్థితి*

*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 19 కోట మండలం,*

నెల్లూరు జిల్లా కోట పంచాయతీ కార్యాలయానికి అతి సమీపంలో, అంగన్వాడీ కేంద్రం దగ్గర పైప్‌లైన్ పగిలి సుమారు 20 రోజులుగా నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని రోజులుగా ఈ మార్గంలో మట్టి టిప్పర్లు భారీ లోడుతో రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో పైప్‌లైన్ దెబ్బతిన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
దీంతో పైప్‌లైన్ నుంచి నీరు లీకై రోడ్డుపై ఉన్న వ్యర్థాలతో కలిసి మురికిగా మారి కలుషితమవుతోంది. తాగునీరు వృథా అవుతుండటంతో పాటు పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి పైప్‌లైన్‌కు తక్షణమే మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టి సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

*కోటలో 20 రోజులుగా పైప్‌లైన్ లీకేజీ.. అధికారుల నిర్లక్ష్యం* *నీరు వృథాగా పోతున్నా పట్టించుకోని వైనం* *మురికితో కలిసిన నీటితో కలుషితమవుతున్న పరిస్థితి* } { *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 19 కోట మండలం,* }

Leave a comment

Your email address will not be published. Required fields are marked *