ఖమ్మం: హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ హోలీ పండుగ సౌభ్రాతృత్వానికి, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు.
సమాజంలో విభిన్న వర్గాల మధ్య ప్రేమ, పరస్పర గౌరవం పెంపొందించే పండుగ హోలీ అని అన్నారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా, పర్యావరణ హితంగా హోలీ వేడుకలను జరుపుకోవాలని సూచించారు.


