
నరసన్నపేట మండలం శ్రీరాంపురం వద్ద హైవే సర్వీస్ రోడ్డుపై వర్షపు నీరు నిల్వై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డంతా నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు మరింతగా పెరిగాయి.
ప్రతిరోజూ వందలాది వాహనాలు ప్రయాణించే ఈ మార్గంలో డ్రైనేజీ సదుపాయాలు లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

