శ్రీకాళహస్తి పట్టణంలో హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతిభావంతులు, పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చిల్డ్రన్స్ ఫ్యాన్సీ యజమాని మునీర్ భాష ప్రతి నెలా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అవసరమైన వారికి చేయూతనందిస్తున్నారు. ఆదివారం నాడు నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఒకటో పట్టణ వలయాధికారి (సి.ఐ) ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై పేదలకు, ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ…. సమాజంలో వెనుకబడిన వర్గాలకు సహాయం చేయడంలో హెల్పింగ్ హాండ్స్ సంస్థ చేస్తున్న సేవలను అభినందించారు. మునీర్ భాష చేపడుతున్న సామాజిక సేవలను అందరూ ఆదర్శంగా తీసుకుని సేవాభావంతో ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు మునీర్ భాషతో పాటు కమిటీ సభ్యులు, వాలంటీర్లు పాల్గొన్నారు.

హెల్పింగ్ హాండ్స్ సేవలు ప్రశంసనీయం – వన్ టౌన్ సి.ఐ. ప్రకాష్