వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ అరవపల్లి జిల్లా పరిషత్ మైదానము నందు వాకర్స్ ఇంటర్నేషనల్ క్యాబినెట్ డైరెక్టర్ SI మన్నెం. రామ మోహన్ సారధ్యంలో హరిత గ్రామ సాధన ప్రక్రియలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.
ఈ సందర్భంగా SI మన్నెం రామమోహన్ మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంచే క్రమంలో వృక్షో రక్షతి రక్షితః అన్న సూక్తిని స్ఫూర్తిగా తీసుకొని హరిత గ్రామమే లక్ష్యంగా జిల్లా పరిషత్ మైదానం నందు మునుపు కూడా మొక్కలు నాటి సంరక్షించడం జరిగింది . అలాగే ఇవాళ కూడా మరిన్ని మొక్కలు నాటడం ద్వారా ప్రకృతిని పరిరక్షించడం కోసం అందరూ భాగస్వాములై కలిసి రావడం చాలా సంతోషం కలిగించిందని తెలియజేశారు. వర్షాకాలం మొదలైనందున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం కోసం ముందుకు రావాలని తద్వారా పచ్చదనం పెంపొందించాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నందలూరు PHC కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తనికంటి వెంకటనారాయణ,మోడపోతుల రాము, తదితరులు పాల్గొన్నారు.

హరిత గ్రామ సాధనలో భాగంగా మొక్కలు నాటిన మన్నెం
వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ అరవపల్లి జిల్లా పరిషత్ మైదానము నందు వాకర్స్ ఇంటర్నేషనల్ క్యాబినెట్ డైరెక్టర్ SI మన్నెం. రామ మోహన్ సారధ్యంలో హరిత గ్రామ సాధన ప్రక్రియలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా SI మన్నెం రామమోహన్ మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంచే క్రమంలో వృక్షో రక్షతి రక్షితః అన్న సూక్తిని స్ఫూర్తిగా తీసుకొని హరిత గ్రామమే లక్ష్యంగా జిల్లా పరిషత్ మైదానం నందు మునుపు కూడా మొక్కలు నాటి సంరక్షించడం జరిగింది . అలాగే ఇవాళ కూడా మరిన్ని మొక్కలు నాటడం ద్వారా ప్రకృతిని పరిరక్షించడం కోసం అందరూ భాగస్వాములై కలిసి రావడం చాలా సంతోషం కలిగించిందని తెలియజేశారు. వర్షాకాలం మొదలైనందున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం కోసం ముందుకు రావాలని తద్వారా పచ్చదనం పెంపొందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నందలూరు PHC కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తనికంటి వెంకటనారాయణ,మోడపోతుల రాము, తదితరులు పాల్గొన్నారు.