శ్రీకాళహస్తి, మార్చి 20, పున్నమి న్యూస్: ప్రభుత్వం నుంచి తనకు దక్కాల్సిన హక్కులను కోరిన ఒంటరి మహిళపై స్థానిక తెలుగు గంగ ప్రాజెక్టు కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం కల్పించాలంటే అనుచిత కోరిక తీర్చాలని ఒత్తిడి తెచ్చినట్లు బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి వివరాల మేరకు… శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగు గంగ కాలనీలో కూతురితో కలిసి నివసిస్తున్న ఆమె, ఇటీవల మరణించిన తన పినతండ్రి ద్వారా లభించాల్సిన ప్రభుత్వ ప్రయోజనాల కోసం కార్యాలయాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న సుబ్బారెడ్డి అనే ఉద్యోగి, వివిధ కారణాలు చూపుతూ ఆమెను పదేపదే కార్యాలయానికి రప్పించి వేధింపులకు గురి చేసినట్లు తెలిపింది. ఉద్యోగం కల్పించాలంటే తన కోరిక తీర్చాల్సిందేనని డిమాండ్ చేయడంతో పాటు, కావాలని పత్రాల్లో లోపాలు చూపుతూ ఇబ్బందులకు గురి చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. ఆమె ప్రతిఘటించడంతో, స్థానికంగా గంగయ్య అనే వ్యక్తిని ప్రోత్సహించి వేధింపులకు దిగేలా చేశాడని పేర్కొంది. గంగయ్య తరచూ మద్యం మత్తులో వచ్చి మహిళతో పాటు ఆమె కుమార్తె పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడని ఫిర్యాదులో వెల్లడించింది. దీంతో విసిగి పోయిన బాధితురాలు ఈ నెల 16న జిల్లా కలెక్టర్‌కు, అలాగే టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనకు ప్రాణహాని ఉందని కూడా ఆమె పేర్కొంది. ఘటనపై అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

హక్కులు అడిగిన ఒంటరి మహిళపై వేధింపులు… ఉద్యోగం కోసం అసభ్య డిమాండ్ ఆరోపణలు