విజయవాడలో అక్టోబర్ 6న స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు 2025 ప్రదానోత్సవం ఘనంగా జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై రాష్ట్ర స్థాయిలో ఎంపికైన మున్సిపాలిటీలు, పంచాయతీలకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. రాష్ట్రంలో పరిశుభ్రత, పారిశుధ్యం, అభివృద్ధి చర్యల్లో ప్రతిభ కనబరచిన పట్టణాలు, గ్రామాలకు ఈ గుర్తింపు లభించింది.
ఎంపికైన మున్సిపాలిటీలు:
మంగళగిరి-తాడేపల్లి, తాడిపత్రి, బొబ్బిలి, పలమనేరు, ఆత్మకూరు (నెల్లూరు), కుప్పం.
ఎంపికైన పంచాయతీలు:
చౌడువాడ (అనకాపల్లి), ఆర్.ఎల్.పురం (ప్రకాశం), లోల్ల ( డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ), చల్లపల్లి (కృష్ణా), చెన్నూరు (కడప), కనమకుల పల్లె (చిత్తూరు).
ఈ అవార్డులు స్థానిక సంస్థల కృషిని ప్రోత్సహిస్తూ, పరిశుభ్రత పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో కీలకంగా నిలుస్తాయి.


