స్వచ్ఛత హీ – సేవ
పున్నమి వార్తలు, మేడ్చల్, తెలంగాణ. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల NSS విద్యార్థులు, విద్యార్థినులు సేవలు చేయుచున్నారు. పరిసర శుభ్రతతో పాటు సామాజిక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. భాగంగా నాడు సిద్దిపేట జిల్లా, బిబిపేట మండలంలోని ముదుమల గ్రామములో విద్యార్థులు ప్రముఖంగా గ్రామములో పాఠశాల పరిసరాలు, రహదారుల పరిసరాలు శుభ్రపరిచారు.
తదుపరి పాఠశాల విద్యార్థులకు ముఖ్యంగా పాఠశాల శుభ్రత యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. చెత్తను పాఠశాల పరిసరాలలో వేయకూడదని, పాఠశాలలో స్వచ్ఛతతో పాటు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు వివరించారు.
అలాగే పరిసర శుభ్రత కార్యక్రమంలో భాగంగా చెట్లకు నీరు పోశారు. పాఠశాల ప్రాంగణంలో ఉన్న చెట్లకు విద్యార్థులు నీరు పోశారు. గ్రామములో ఈ కార్యక్రమం మార్పులకు నాంది పలికింది. గ్రామములో విద్యార్థుల పరిసర శుభ్రత కార్యక్రమము చూసి గ్రామ ప్రజలు స్ఫూర్తి పొంది తమ ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారు.
దీనివల్ల గ్రామ ప్రజలలో శ్రద్ధ, భాద్యత పెరిగాయి. గ్రామస్థులు కలసి ఈ స్వచ్ఛత కార్యక్రమము నిర్వహించారు.
అలాగే విద్యార్థులు రక్తదాన స్వచ్ఛత సేవా కార్యక్రమములో పాల్గొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేయుటకు NSS కార్యకర్తలు ముందుకు వచ్చారు. తమ కార్యక్రమములోనూ, గ్రామముల, పాఠశాలల శుభ్రత కార్యక్రమములోనూ విజయం సాధించారు.


