Friday, 6 February 2026
  • Home  
  • స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయం* *పార్టీని మరింత బలోపేతం చేయాలని గంటా పిలుపు*
- విశాఖపట్నం

స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయం* *పార్టీని మరింత బలోపేతం చేయాలని గంటా పిలుపు*

*స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయం* *పార్టీని మరింత బలోపేతం చేయాలని గంటా పిలుపు* _*విశాఖపట్నo డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి*_ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయానికి అనుగుణంగా పార్టీని మరింత బలోపేతం చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. భీమిలి రూరల్, పద్మనాభం, ఆనందపురం మండలాల ముఖ్యనేతలతో క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడం ద్వారా ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో మూడు మండలాల్లో అన్ని గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులు గురించి ఆరా తీశారు. సాంకేతిక సమస్యల కారణంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, వాహన మిత్ర వంటి సంక్షేమ పథకాల సొమ్ము కొంతమందికి జమ కాలేదని ఈ సందర్భంగా నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లారు. స్పౌజ్ పెన్షన్లు ఇస్తున్నప్పటికీ.. కొత్త పెన్షన్ల కోసం వినతులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. పాత ప్రభుత్వం ఇచ్చిన కాలనీల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇస్తామని.. ఇళ్ల స్థలాల కోసం తమను సంప్రదించాలని వైసీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని పద్మనాభం మండలం నేతలు తెలియజేశారు. సచివాలయం, రెవిన్యూ సిబ్బంది కొందరు ఆ పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. సమర్ధంగా పని చేసే సచివాలయం ఉద్యోగులను డిప్యుటేషన్ పై కలెక్టరేట్, జిల్లా పరిషత్ లకు తీసుకెళ్లిపోవడంతో ఇబ్బంది పడుతున్నామన్నారు. జల్ జీవన్ మెషీన్ కింద రోడ్లన్నీ తవ్వేసి వదిలేయడంతో వాహన చోదకులు కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రధానమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని 3 మండలాల నాయకులకు గంటా హామీ ఇచ్చారు. ప్రతి నెల జరిగే పార్టీ సమావేశాలకు వరుసగా మూడు సార్లు గైర్హాజరైతే, ఆయా పదవులకు అనర్హులవుతారని గంటా పార్టీ కమిటీలను హెచ్చరించారు. భీమిలి జెడ్.పి.టి.సి. గాడు వెంకటప్పడు, భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండల పార్టీ అధ్యక్షులు సరగడ అప్పారావు, కోరాడ రమణ, తాట్రాజు అప్పారావు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, బి.ఆర్.బి. నాయుడు, డి.ఎ.ఎన్.రాజు, కసిరెడ్డి దామోదరరావు, కాళ్ల నగేష్ కుమార్, కురుమిన లీలావతి, మజ్జి నందీష్, రామరాజు, కాకర వెంకట రమణ, వై. అనిల్ ప్రసాద్, బమ్మిడి ఉమాదేవి, కాకర్లపూడి శ్రీకాంత్ రాజు, కర్రి శ్రీనివాసరావు, కాళ్ల సత్యనారాయణ, బలిరెడ్డి మల్లిఖార్జునరావు, గండ్రెడ్డి సోమినాయుడు, ఎం.శివాజీ, సత్య వరప్రసాద్, చందవరపు కుమార్, గుడ్డాల ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. *గ్రీవెన్స్ నిర్వహించిన గంటా* ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భీమిలి క్యాంప్ కార్యాలయంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందించారు. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట ప్రతి సోమవారం తాను పి.జి.ఆర్.ఎస్.లో పాల్గొంటానని గంటా చెప్పారు. ఎప్పుడైనా కుదరని పక్షంలో మంగళవారం నుంచి శుక్రవారం మధ్యలో ఒక రోజు మండల కార్యాలయాల్లో గానీ జోనల్ కార్యాలయాల్లో గానీ నిర్వహిస్తానని ప్రకటించారు. శ్మశాన వాటిక.. డ్రెయిన్.. దివ్యాంగ పెన్షన్.. జల్ జీవన్ మెషీన్ నీటి సరఫరా, జిరాయితీ భూమిలో హౌసింగ్ చేపట్టడం తదితరాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. ఈనెల 12 న ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన అనంతరం.. జోన్ల పునర్వ్యవస్థీకరణపై మున్సిపల్ మంత్రి పి.నారాయణ, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ లతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. భీమిలి ఎమ్మార్వో పి.రామారావు, జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు తదితరులు పాల్గొన్నారు.

*స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయం*

*పార్టీని మరింత బలోపేతం చేయాలని గంటా పిలుపు*

_*విశాఖపట్నo డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి*_ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయానికి అనుగుణంగా పార్టీని మరింత బలోపేతం చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. భీమిలి రూరల్, పద్మనాభం, ఆనందపురం మండలాల ముఖ్యనేతలతో క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడం ద్వారా ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో మూడు మండలాల్లో అన్ని గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులు గురించి ఆరా తీశారు. సాంకేతిక సమస్యల కారణంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, వాహన మిత్ర వంటి సంక్షేమ పథకాల సొమ్ము కొంతమందికి జమ కాలేదని ఈ సందర్భంగా నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లారు. స్పౌజ్ పెన్షన్లు ఇస్తున్నప్పటికీ.. కొత్త పెన్షన్ల కోసం వినతులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. పాత ప్రభుత్వం ఇచ్చిన కాలనీల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇస్తామని.. ఇళ్ల స్థలాల కోసం తమను సంప్రదించాలని వైసీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని పద్మనాభం మండలం నేతలు తెలియజేశారు. సచివాలయం, రెవిన్యూ సిబ్బంది కొందరు ఆ పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. సమర్ధంగా పని చేసే సచివాలయం ఉద్యోగులను డిప్యుటేషన్ పై కలెక్టరేట్, జిల్లా పరిషత్ లకు తీసుకెళ్లిపోవడంతో ఇబ్బంది పడుతున్నామన్నారు. జల్ జీవన్ మెషీన్ కింద రోడ్లన్నీ తవ్వేసి వదిలేయడంతో వాహన చోదకులు కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రధానమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని 3 మండలాల నాయకులకు గంటా హామీ ఇచ్చారు. ప్రతి నెల జరిగే పార్టీ సమావేశాలకు వరుసగా మూడు సార్లు గైర్హాజరైతే, ఆయా పదవులకు అనర్హులవుతారని గంటా పార్టీ కమిటీలను హెచ్చరించారు. భీమిలి జెడ్.పి.టి.సి. గాడు వెంకటప్పడు, భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండల పార్టీ అధ్యక్షులు సరగడ అప్పారావు, కోరాడ రమణ, తాట్రాజు అప్పారావు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, బి.ఆర్.బి. నాయుడు, డి.ఎ.ఎన్.రాజు, కసిరెడ్డి దామోదరరావు, కాళ్ల నగేష్ కుమార్, కురుమిన లీలావతి, మజ్జి నందీష్, రామరాజు, కాకర వెంకట రమణ, వై. అనిల్ ప్రసాద్, బమ్మిడి ఉమాదేవి, కాకర్లపూడి శ్రీకాంత్ రాజు, కర్రి శ్రీనివాసరావు, కాళ్ల సత్యనారాయణ, బలిరెడ్డి మల్లిఖార్జునరావు, గండ్రెడ్డి సోమినాయుడు, ఎం.శివాజీ, సత్య వరప్రసాద్, చందవరపు కుమార్, గుడ్డాల ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

*గ్రీవెన్స్ నిర్వహించిన గంటా*

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భీమిలి క్యాంప్ కార్యాలయంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందించారు. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట ప్రతి సోమవారం తాను పి.జి.ఆర్.ఎస్.లో పాల్గొంటానని గంటా చెప్పారు. ఎప్పుడైనా కుదరని పక్షంలో మంగళవారం నుంచి శుక్రవారం మధ్యలో ఒక రోజు మండల కార్యాలయాల్లో గానీ జోనల్ కార్యాలయాల్లో గానీ నిర్వహిస్తానని ప్రకటించారు. శ్మశాన వాటిక.. డ్రెయిన్.. దివ్యాంగ పెన్షన్.. జల్ జీవన్ మెషీన్ నీటి సరఫరా, జిరాయితీ భూమిలో హౌసింగ్ చేపట్టడం తదితరాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. ఈనెల 12 న ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన అనంతరం.. జోన్ల పునర్వ్యవస్థీకరణపై మున్సిపల్ మంత్రి పి.నారాయణ, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ లతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. భీమిలి ఎమ్మార్వో పి.రామారావు, జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.