పున్నమి ప్రతినిధి
ముగ్గురు మంత్రుల ముద్దుల జిల్లాలొ ఏమిటీ ధరిద్రం… స్థంబాద్రి లక్ష్మీ నరసింహస్వామి దివ్య క్షేత్రం లొ కొనేరు శుభ్రం చేయటానికి నిధులు లేవా?
ఖమ్మం పేరే స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి పేరు.. “ఖభం” అంటే స్తంభం అని అర్థం.. స్తంభం నుండి ఉద్భవించిన శ్రీ నారసింహుని స్వయంభు క్షేత్రం స్తంభాద్రిపురం మన ఖమ్మం… మరి అంతటి ప్రాచీనమైన క్షేత్రం, అంతే ప్రాచీనమైన పవిత్రమైనది ఇక్కడి కొనేరు… ఇక్కడి కోనేరు కూడా సాక్షాత్తు స్వామివారి నిత్యాభిషేక కర్మలకు కావాల్సిన జలం కోసం నరసింహుడే ఏర్పాటు చేశాడని చెప్తారు, స్వామి వారి పాదంతో మొదటం ద్వారా కోనేరు ఏర్పడిందని ప్రతీతి… మరి ఆ పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలపైన ఉన్నదా? లేదా? జిల్లా కేంద్రం నడిబొడ్డులో ఉన్న దేవాలయాల పరిస్థితి ఇలా ఉంటే మిగతా చోట ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. కొట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ కనీసం కోనేరు ను శుభ్రం చేయలేని దుస్థితి లొ ఎండొన్మెంట్ వుండటం దురదృష్టకరం.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కోనేరుని శుభ్రం చేయవలసిందిగా భక్తులు కోరుతున్నరూ


