*స్క్రబ్ టైఫస్” ప్రాణాంతకం కాదు*
*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-*
విశాఖపట్నం డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, వారు పత్రికా ముఖంగా తెలియచేయునది ఏమనగా “స్క్రబ్ టైఫస్” ప్రాణాంతకం కాదు దీని గురించి ప్రజలెవరూ భయాందోలనలు చెందనవసరం లేదని తెలియచేసారు. ఈ జీవి కుట్టినప్పుడు కనపడే లక్షణాలు జ్వరం, తలపోటు, కండరాల నొప్పులు, ఆకలి లేకపోవడం, శోషరస కణుపుల వాపు, వినికిడి తగ్గుదల, దగ్గు మరియు శ్వాస ఆడకపోవడం మొదలగు లక్షణాలు కనపడుట, చికిత్స డాక్షిసైక్లిన్, ఎజిత్రోమైసిన్ వంటి మందులు వాడటం ద్వారా నివారించవచ్చు.
నివారణ మరియు జాగ్రతలు: ఇంట్లో ఎలుకలు రాకుండా/లేకుండా చూసుకోవడం మరియు యాంటీ ఇన్సేక్టిసైడిస్, స్ప్రేలు వాడటం ద్వారా ఎలుకలు రాకుండా చూసుకోవచ్చు.
ఈ వ్యాది విశాఖపట్నం జిల్లాలో 2023 లో 12 పాజిటివ్ కేసులు, 2024 లో 11 పాజిటివ్ కేసులు, 2025 లో 11 పాజిటివ్ కేసులు సంబవించాయి. వీటిలో ఒక్క మరణం కూడా సంభవించలేదు. కనుక ప్రజలెవరూ కూడా ఈ వ్యాది గురించి ఆందోళన చెందనవసరం లేదు, నల్లటి కురుపు, లింప్ నోడ్స్ వాయుట మరియు జ్వరం వచ్చినచో సమీప ఆరోగ్య కేంద్రమునకు వెళ్లి వైద్యుని సంప్రదించి తగు చికిత్స పొందవలెనని డా.పి.జగదీశ్వర రావు వారు తెలియచేసారు.

స్క్రబ్ టైఫస్” ప్రాణాంతకం కాదు*
*స్క్రబ్ టైఫస్” ప్రాణాంతకం కాదు* *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-* విశాఖపట్నం డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, వారు పత్రికా ముఖంగా తెలియచేయునది ఏమనగా “స్క్రబ్ టైఫస్” ప్రాణాంతకం కాదు దీని గురించి ప్రజలెవరూ భయాందోలనలు చెందనవసరం లేదని తెలియచేసారు. ఈ జీవి కుట్టినప్పుడు కనపడే లక్షణాలు జ్వరం, తలపోటు, కండరాల నొప్పులు, ఆకలి లేకపోవడం, శోషరస కణుపుల వాపు, వినికిడి తగ్గుదల, దగ్గు మరియు శ్వాస ఆడకపోవడం మొదలగు లక్షణాలు కనపడుట, చికిత్స డాక్షిసైక్లిన్, ఎజిత్రోమైసిన్ వంటి మందులు వాడటం ద్వారా నివారించవచ్చు. నివారణ మరియు జాగ్రతలు: ఇంట్లో ఎలుకలు రాకుండా/లేకుండా చూసుకోవడం మరియు యాంటీ ఇన్సేక్టిసైడిస్, స్ప్రేలు వాడటం ద్వారా ఎలుకలు రాకుండా చూసుకోవచ్చు. ఈ వ్యాది విశాఖపట్నం జిల్లాలో 2023 లో 12 పాజిటివ్ కేసులు, 2024 లో 11 పాజిటివ్ కేసులు, 2025 లో 11 పాజిటివ్ కేసులు సంబవించాయి. వీటిలో ఒక్క మరణం కూడా సంభవించలేదు. కనుక ప్రజలెవరూ కూడా ఈ వ్యాది గురించి ఆందోళన చెందనవసరం లేదు, నల్లటి కురుపు, లింప్ నోడ్స్ వాయుట మరియు జ్వరం వచ్చినచో సమీప ఆరోగ్య కేంద్రమునకు వెళ్లి వైద్యుని సంప్రదించి తగు చికిత్స పొందవలెనని డా.పి.జగదీశ్వర రావు వారు తెలియచేసారు.

