Thursday, 5 February 2026
  • Home  
  • స్కూళ్లకు దసరా సెలవులపై తాజా నిర్ణయం – అమలు ఇలా..!!
- పిల్లలకు

స్కూళ్లకు దసరా సెలవులపై తాజా నిర్ణయం – అమలు ఇలా..!!

ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : దసరా సెలవుల పైన ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. దసరా సెలవుల పైన ముందుగానే ప్రకటన చేసినా.. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో సెలవులు ఇస్తున్నారు. దీంతో, ఈ సెలవుల కారణం గా సిలబస్ కు ఇబ్బంది లేకుండా అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ క్రమంలో దసరా సెలవుల పైన కొంత సందిగ్ధత నెలకొంది. కాగా..ముందుగా ప్రకటించిన విధంగానే దసరా సెలవుల కొనసాగింపుకు అధికారులు నిర్ణయించారు. ప్రస్తుత ఆగస్టు నెలలో స్కూళ్లకు సాధారణ సెలవులతో పాటుగా వర్షాల కారణంగా మరిన్ని సెలవులు వచ్చాయి. ఇక, అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్ మూడోవారం నుంచి తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రాల్లో స్కూళ్లకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏపీలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు. క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు హాలీడేస్ ప్రకటించనున్నారు. ప్రత్యేక పండుగలు, ఆదివారాలు ,రెండో శనివారాలు అన్ని కలిపితే విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి. తెలంగాణలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి.

ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి :
దసరా సెలవుల పైన ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. దసరా సెలవుల పైన ముందుగానే ప్రకటన చేసినా.. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో సెలవులు ఇస్తున్నారు. దీంతో, ఈ సెలవుల కారణం గా సిలబస్ కు ఇబ్బంది లేకుండా అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ క్రమంలో దసరా సెలవుల పైన కొంత సందిగ్ధత నెలకొంది. కాగా..ముందుగా ప్రకటించిన విధంగానే దసరా సెలవుల కొనసాగింపుకు అధికారులు నిర్ణయించారు.
ప్రస్తుత ఆగస్టు నెలలో స్కూళ్లకు సాధారణ సెలవులతో పాటుగా వర్షాల కారణంగా మరిన్ని సెలవులు వచ్చాయి. ఇక, అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్ మూడోవారం నుంచి తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రాల్లో స్కూళ్లకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏపీలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు. క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు హాలీడేస్ ప్రకటించనున్నారు. ప్రత్యేక పండుగలు, ఆదివారాలు ,రెండో శనివారాలు అన్ని కలిపితే విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి. తెలంగాణలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.