సీతారామపురం ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
సీతారామపురం మండలంలోని మారంరెడ్డిపల్లి పిఎసిఎస్ చైర్మన్ గా ఇటీవల ఎన్నికైన సోమనబోయిన రాజశేఖర్(రాజా) ను గురువారం స్థానిక సొసైటీ కార్యాలయంలో సీతారామపురానికి చెందిన ఆది చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆది నారాయణరావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదినారాయణరావు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోనే అత్యంత వెనుకబడిన మెట్ట ప్రాంతమైన సీతారామపురం మండలంలోని రైతుల అభివృద్ధికి రుణాలను అందించి రైతులను ఆదుకోవాలన్నారు. రైతులకు ఉత్తమ సేవలను అందించి సొసైటీ చైర్మన్ పదవికి వన్నె తీసుకువచ్చేలా సోమనబోయిన రాజశేఖర్ పనిచేశారని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కే. కిషోర్, గురు, శివ, కుశల్ పాల్గొన్నారు.


