చిట్వేల్ మండలానికి చెందిన శివకు సెప్టెంబర్ 8న మధ్యాహ్నం 12:30 గంటలకు డాక్టర్ సంజయ్ గుప్తా పేరుతో ఒక వ్యక్తి వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. సీలింగ్ ఫ్యాన్ కావాలని అడిగి, ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపుతానని చెప్పాడు. నిజంగా డబ్బు పంపకుండా, బ్యాంక్ మెసేజ్‌లా కనిపించే నకిలీ టెక్స్ట్ మెసేజ్ పంపి “₹17,000 పంపించాను” అని నమ్మబలికాడు. అనంతరం ఎక్కువ అమౌంట్ పొరపాటున పంపానని, వెంటనే జీపే ద్వారా రీఫండ్ చేయమని బ్రతిమిలాడాడు. కానీ శివ అనుమానం చెంది తన అకౌంట్ చెక్ చేయగా ఎటువంటి డబ్బు రాలేదని తెలుసుకుని మోసపోకుండా తప్పించుకున్నాడు. ఈ సందర్భంగా శివ ప్రజలకు హెచ్చరిక చేస్తూ, ఇలాంటి నకిలీ మెసేజ్‌లు నమ్మకూడదని, ఎవరికీ డబ్బు రిటర్న్ చేయకూడదని, అలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సైబర్ ఫ్రాడ్ ప్రయత్నం – శివ అప్రమత్తంగా మోసాన్ని అడ్డుకున్నారు