*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- సెంటర్ ఫర్ ఎనర్జీ, సైబర్ రెజిలియన్స్ కేంద్రం ఏర్పాటుకు సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం- ఏపీ ప్రభుత్వం*
*ఎనర్జీ సైబర్ రెజిలియన్స్ సెంటర్ ఎంఓయూ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు నారా లోకేష్, గొట్టిపాటి రవికుమార్, ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఎండీ జెరెమీ జర్గెన్స్, సీఎస్ కె.విజయానంద్*
*అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…*
• ప్రపంచం అంతా గ్రీన్ ఎనర్జీ వినియోగం గురించే ఆలోచన చేస్తోంది.
• 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఏపీలో ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం
• అతితక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి సాధించి సరఫరా చేయాలనేది మా ప్రభుత్వ ఆలోచన
• ఇంధన రంగంలో అవసరమైన సైబర్ రక్షణ వ్యవస్థలను కూడా తయారు చేసుకోవాలి
• ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంస్కరణలు చేసి వినియోగాన్ని పెంచగలిగాం
• ఏఐ లాంటి టెక్నాలజీ వినియోగం ద్వారా విద్యుత్ పంపిణీ నష్టాలు, సరఫరా వ్యయం తగ్గించాలి
• అప్పుడే ఇంధన రంగంలో సుస్థిరత సాధ్యం అవుతుంది.
• వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు, గృహాలు ఇలా అన్నిటికీ విద్యుత్ అవసరం
• అత్యంత నాణ్యమైన, తక్కువ వ్యయంతో విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది
• ఎక్కడికక్కడే విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా విధానాలను కూడా తయారు చేసుకుంటున్నాం
• ట్రాన్స్ మిషన్ నష్టాలను కూడా గణనీయంగా తగ్గించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి
• పునరుత్పాదక విద్యుత్ రంగంలో ప్రజలకు ప్రయోజనాలు కలిగేలా వ్యవస్థలు ఉండాలి
• ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద ఏపీలో సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టును వేగంగా చేపట్టాం
*మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ…*
• ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి దిశగా దూసుకువెళ్తోంది.
• 6 గిగావాట్ల సామర్ధ్యంతో డేటా సెంటర్ విశాఖకు తీసుకురావాలని ఆలోచన చేశాం
• ఇప్పుడు అది సాకారం అయ్యింది. ఇలాంటి డేటా సెంటర్లు వినియోగించే విద్యుత్ తయారు చేయటం ఓ సవాలు
• అలాగే తక్కువ వ్యయంతో నాణ్యమైన విద్యుత్ తయారు చేయటం కూడా ముఖ్యమైన అంశం
• అధిక ధరలకు విద్యుత్ ఉత్పత్తి చేసి డేటా సెంటర్లకు సరఫరా చేస్తే అది వ్యయం ఎక్కువ అయిపోతుంది
• అందుకే ఆధునిక టెక్నాలజీలపై ఆలోచన చేసిన సీఎం చంద్రబాబు వాటిని నిజం చేస్తున్నారు
• సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెజిలియన్స్ సెంటర్ అనేది విద్యుత్ వ్యవస్థల రక్షణకు పనిచేస్తుంది
• ఆయన ఆలోచన చేస్తే దానిని తక్షణం అమలు చేయాలని ఆదేశిస్తారు. అందుకే మేం అంతా వాటిని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం
• ఏపీ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని పారిశ్రామిక వేత్తలను కోరుతున్నాను
*జెరెమీ జెర్గెన్స్ మాట్లాడుతూ….*
• ఏఐ ట్రాన్సిషన్ సమయంలో ఇంధన వ్యవస్థల భద్రత అత్యంత కీలకమైన అంశం
• ఏపీలో ఇంధన భద్రత, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవటం అభినందనీయం
• విద్యుత్ ఉత్పత్తి, ఇంధన భద్రత విషయంలో భారత్‌లో వేగంగా నిర్ణయాలు జరుగుతున్నాయి
• ఇలాంటి సమయంలో వ్యవస్థల రక్షణ అత్యంత కీలకమైన అంశం
• దీనికి అవసరమైన నిపుణులైన మానవ వనరుల్ని తయారు చేసుకోవాల్సి ఉంది
• సామాజికంగా, ఆర్ధికంగా స్వావలంబన సాధించాలంటే ఈ తరహా కేంద్రాలు అవసరం అవుతుంది
*విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ…*
• ఈ కేంద్రం కేవలం టెక్నాలజీ కోసం మాత్రమే కాదు. ఇంధన వ్యవస్థల రక్షణ కోసం ఏర్పాటు
• ఏపీ 160 గిగావాట్ల గ్రీన్ విద్యుత్ ఉత్పత్తి దిశగా భారీ పెట్టుబడులు తీసుకొస్తోంది.
• ఈ సమయంలో విద్యుత్ వ్యవస్థల సెక్యూరిటీ చాలా ముఖ్యం.
• అందుకే సెంటర్ ఫర్ ఎనర్జీ, సైబర్ రెజిలియన్స్ కేంద్రం ఏర్పాటు చేసుకుంటున్నాం


