మాదే అసలైన రిజిస్టర్ సువర్ణ వర్తక సంఘం
– శ్రీసువర్ణ వర్తక సంఘం అధ్యక్షుడు కడియాల శ్రీనివాస్ విమర్శ
రాజమహేద్రవరం,
హరి అధ్యక్షుడుగా ఉన్న సువర్ణ వర్థక సంఘం ఫేక్ అధ్యక్షుడు అని శ్రీ సువర్ణ వర్థక సంఘం అధ్యక్షుడు కడియాల శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.శనివారం నల్లమందు సందులోని రాజేశ్వరి జ్యువెల్లరీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్నగాక మొన్న వచ్చిన హరి తనను సువర్ణ వర్థక సంఘం నుంచి బహిష్కరణ చేయడానికి అతని జీవితకాలం సరిపోదని మండిపడ్డారు. తాను ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షుడినని, ఆతనీకి మాదిరి అధ్యక్షుడుగా ప్రకటించుకున్నవాడిని కానని ఆయన విమర్శించారు.వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ఎంపీ మార్గాని భరత్ పక్కన చేరి ఎన్నో అవకతవకలకు పాల్పడిన అడపా హరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పక్కన చేరి పబ్బం గడుపు కుంటున్నాడని మండి పడ్డారు.సువర్ణవర్తక సంఘంలోకి కులాన్ని, పార్టీలను ఎందుకుతీసుకు రావాలని ఆయన నిలదీశారు.సువర్ణ వర్తక సంఘం సభ్యులకు బంగారం క్రయ విక్రయాల్లో ఏదైనా ఇబందులు వస్తే హరి పరిష్కరించలేడని, పోలీసులు వస్తే ఎలా మాట్లాడాలో తెలియదని తీసీపాడేశారు. పోరాటం చేసి తాను సంఘాన్ని ముందుకు నడిపిస్తానని కడియాల శ్రీనివాస్ అన్నారు.ఈ పార్టీలో ఉండి హయాంలో రాజమండ్రిని భ్రష్టు పట్టించిన హరి ఇప్పుడు సువర్ణ వర్తక సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడని ఆయన ఆరోపించారు.సమావేశంలో కడియాల వరబాబు తదితరులు పాల్గొన్నారు.


