నెల్లూరు, (మన పున్నమి ప్రతినిధి):
నెల్లూరు బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది, జనవిజ్ఞాన వేదిక మాజీ నాయకులు యర్రమరెడ్డి విజయ మోహన్ రెడ్డి గారు అనారోగ్యంతో కన్నుమూశారు. కమ్యూనిస్టు పార్టీలో బలమైన అనుబంధం, పేదల పట్ల అపారమైన సానుభూతితో ఈ కుటుంబం ప్రత్యేకంగా నిలిచింది. వారి అంతిమయాత్ర 10వ తేదీ మద్యాహ్నం బాలాజీ నగర్ గ్యాస్ గోడాం పక్కనుండి ప్రారంభం కానుంది. NIFAA సభ్యులు సైతం ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబానికి ధైర్యం కలగాలని అందరు కోరుతున్నారు.


