Monday, 23 March 2026
  • Home  
  • సీనియర్ జర్నలిస్ట్ అడపాకు జర్నలిస్టులు ఘన నివాళి
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సీనియర్ జర్నలిస్ట్ అడపాకు జర్నలిస్టులు ఘన నివాళి

అమలాపురం, అక్టోబరు 09 (పున్నమి ప్రతినిధి) : సీనియర్ జర్నలిస్ట్ అడపా అప్పారావు మృతి పట్ల అమలాపురం జర్నలిస్టులు ప్రగాఢ సంతాపం తెలిపారు. గడియార స్తంభం సెంటర్ లో అప్పారావు చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అప్పారావు చిత్ర పటం వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు. సీనియర్ జర్నలిస్ట్ అప్పారావు మృతి ఉభయ గోదావరి జిల్లాల్లోని జర్నలిస్టు లోకానికి తీరని లోటని సీనియర్ జర్నలిస్ట్ టికె విశ్వనాథ్ అన్నారు. రాజకీయ నాయకులకు విలువైన సలహా సూచనలు ఇచ్చిన వ్యక్తి అప్పారావు అని కొనియాడారు. జర్నలిస్టులు అందరితో స్నేహ సంబంధాలు కల్గి అందరి శ్రేయస్సును కోరే అప్పారావు మృతి బాధాకరమని జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు కొర్లపాటి ప్రదీప్ కుమార్ అన్నారు. అప్పారావు నివాళులు అర్పించిన వారిలో సీనియర్ జర్నలిస్టులు సుంకర ప్రసాద్, కాకిలేటి సూరిబాబు, నిమ్మకాయల సతీష్, ఉండ్రు ప్రసాద్, మద్ధింశెట్టి త్రిమూర్తులు, మహ్మద్ బషీర్, అరిగెల రుద్రా శ్రీనివాస్, పిండి శేషు, దొమ్మేటి వెంకట్, ఎం. వెంకటేష్, విజయ్, భాస్కర్, అరిగెల వసంత్, విజయ్, ఆసు భరత్, పరమట భీమా మహేష్, రాము, పెద్దిరెడ్డి రాము, అజహర్ తదితరులు పాల్గొన్నారు.

అమలాపురం, అక్టోబరు 09 (పున్నమి ప్రతినిధి) : సీనియర్ జర్నలిస్ట్ అడపా అప్పారావు మృతి పట్ల అమలాపురం జర్నలిస్టులు ప్రగాఢ సంతాపం తెలిపారు. గడియార స్తంభం సెంటర్ లో అప్పారావు చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అప్పారావు చిత్ర పటం వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు.
సీనియర్ జర్నలిస్ట్ అప్పారావు మృతి ఉభయ గోదావరి జిల్లాల్లోని జర్నలిస్టు లోకానికి తీరని లోటని సీనియర్ జర్నలిస్ట్ టికె విశ్వనాథ్ అన్నారు. రాజకీయ నాయకులకు విలువైన సలహా సూచనలు ఇచ్చిన వ్యక్తి అప్పారావు అని కొనియాడారు.
జర్నలిస్టులు అందరితో స్నేహ సంబంధాలు కల్గి అందరి శ్రేయస్సును కోరే అప్పారావు మృతి బాధాకరమని జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు కొర్లపాటి ప్రదీప్ కుమార్ అన్నారు.
అప్పారావు నివాళులు అర్పించిన వారిలో సీనియర్ జర్నలిస్టులు సుంకర ప్రసాద్, కాకిలేటి సూరిబాబు, నిమ్మకాయల సతీష్, ఉండ్రు ప్రసాద్, మద్ధింశెట్టి త్రిమూర్తులు, మహ్మద్ బషీర్, అరిగెల రుద్రా శ్రీనివాస్, పిండి శేషు, దొమ్మేటి వెంకట్, ఎం. వెంకటేష్, విజయ్, భాస్కర్, అరిగెల వసంత్, విజయ్, ఆసు భరత్, పరమట భీమా మహేష్, రాము, పెద్దిరెడ్డి రాము, అజహర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.