విశాఖపట్నం, అక్టోబర్ 21:
మొత్తం ₹3,92,610 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు.
మంగళవారం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆరుగురు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. లబ్ధిదారులు బందిపురపు రామయ్య అమ్మ, నగిశెట్టి నాగమణి, రాడి గణేష్, పెదపాటి నానాజీ, సాలాపు నరసమ్మ, మడక పరిదేశి లు.
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొరుపోలు రాము నాయుడు, సింహాచలం, వంగలి గ్రామ సర్పంచ్ గణేష్, ఏఎంసీ డైరెక్టర్ ఆర్.ఎస్. నాయుడు, పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


