పున్నమి ప్రతినిధి , రామచంద్రాపురం
రామచంద్రాపురం మండలం సి.రామాపురంలో పర్యటించిన వైఎస్ఆర్సీపీ చంద్రగిరి నియోజకవర్గం ఇన్చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి*.సి.రామాపురం సర్పంచ్ సుబ్రమణ్యంరెడ్డి పదవీ కాలం ముగియడంతో ఆయన ఇంట జరిగిన ఆత్మీయ విందుకు హాజరైన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి
చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి రాకతో గ్రామంలో ఉత్సాహంగా పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చిన యువత .గ్రామ పంచాయతీని అభివృద్ధి బాటలో నడిపించడానికి తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిS పూర్తిగా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపిన మాజీ సర్పంచ్ సుబ్రమణ్యం రెడ్డి.సి.రామాపురం గ్రామ అభివృద్ధి గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగిందని, సర్పంచ్‌గా అవకాశం కల్పించినందుకు గ్రామంలో తనవంతు బాధ్యతగా కష్టపడి పనిచేశానని చెప్పిన సుబ్రమణ్యం రెడ్డి
పదవీ కాలం ముగిసేంత వరకు నమ్మిన పార్టీ, నమ్ముకున్న నాయకుని వెంట నడుస్తూ ప్రజలకు సేవ చేసిన సర్పంచ్ సుబ్రమణ్యంరెడ్డి, ఆయన కుమారుడు పవన్‌కుమార్ రెడ్డిలను ఘనంగా సత్కరించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.
సర్పంచ్‌గా పదవీ కాలం ముగిసినప్పటికీ పనిచేయాల్సిన సమయం చాలా ఉందని, మీరంతా జగనన్న సైనికులుగా ముందుకురావాలని మోహిత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

