పున్నమి ప్రతినిధి నిర్మల్:
భైంసా మండలం లోని దేగాం గ్రామానికి సింగారపు కైలాష్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో పి హెచ్ డి పట్టాను అందుకున్నారు. మహీంద్రా యూనివర్సిటీలో పి. హెచ్. డి చేయడంతో యూనివర్సిటీ చైర్మన్ ఆనంద్ మహేంద్ర చేతుల మీదుగా పట్టాను అందుకోవడం పట్ల గ్రామస్తులు హర్ష వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ కైలాష్ ప్రస్తుతం స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థి సివిల్ ఇంజనీరింగ్ లో పరిశోధన పూర్తిచేసి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టాను అందుకోవడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. దేగాం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ప్రకాష్ కుమారుడు కైలాస్… కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఎండి జి. వి. ప్రసాద్, వైస్ ఛాన్సలర్ యాదులు మేడురి పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్న సందర్భంగా అతని మిత్రులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేశారు.

సివిల్ ఇంజనీర్ లో డాక్టరేట్ పొందిన దేగాం యువకుడు*
పున్నమి ప్రతినిధి నిర్మల్: భైంసా మండలం లోని దేగాం గ్రామానికి సింగారపు కైలాష్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో పి హెచ్ డి పట్టాను అందుకున్నారు. మహీంద్రా యూనివర్సిటీలో పి. హెచ్. డి చేయడంతో యూనివర్సిటీ చైర్మన్ ఆనంద్ మహేంద్ర చేతుల మీదుగా పట్టాను అందుకోవడం పట్ల గ్రామస్తులు హర్ష వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ కైలాష్ ప్రస్తుతం స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థి సివిల్ ఇంజనీరింగ్ లో పరిశోధన పూర్తిచేసి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టాను అందుకోవడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. దేగాం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ప్రకాష్ కుమారుడు కైలాస్… కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఎండి జి. వి. ప్రసాద్, వైస్ ఛాన్సలర్ యాదులు మేడురి పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్న సందర్భంగా అతని మిత్రులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేశారు.

