సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ను అడ్డుకుంటాం .
__ వామ పక్ష పార్టీల హెచ్చరిక .
విశాఖపట్నం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి :, పెద గంట్యాడ శివారులో ఏర్పాటు కానున్న అదానీ అంబుజా సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ను ఉద్యమాల ద్వారా అడ్డుకుంటామని వామ పక్ష పార్టీలు స్పష్టం చేసాయి. అంబుజా సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు ను వ్యతిరేకిస్తూ గురువారం పెద గంట్యాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద వామ పక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు .ధర్నా నుద్దేశించి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కసి రెడ్డి సత్యనారాయణ , సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు , సిపిఐ ( ఎం ఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు ఎం.వెంకటేశ్వర్లు , సిపిఐ ఎం.ఎల్ ప్రజా పోరు నాయకులు దేవా మాట్లాడుతూ పెద గంట్యాడ శివారులో అదానీ అంబుజా సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు జరిగితే గాజువాక నియోజక వర్గం అంతా బూడిద మయం అవుతుందని , ఇప్పటికే గంగవరం పోర్టు వల్ల ఈ ప్రాంత మంతా తీవ్ర కాలుష్యం తో నిండి పోయి ప్రజలంతా అనారోగ్యానికి గురి అయ్యారని అన్నారు . ఐక్య ఉద్యమాల ద్వారా సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ను ఎదుర్కొంటామని అన్నారు. సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు ప్రక్రియ ను తక్షణమే నిలిపి వేయాలని, లేని పక్షం లో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు . అనంతరం వామ పక్ష పార్టీల ప్రతినిధి బృందం పెద గంట్యాడ తహసీల్దార్ అమలకు వినతి పత్రం అందజేశారు . ఇంకా ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.సత్యాంజనేయ ,జిల్లా సమితి సభ్యులు జి.ఆనంద్ , జి. రాంబాబు , కె.అచ్యుత రావు , పల్లేటి పోలయ్య , పెద పూడి దుర్గా రావు , సిపిఎం నాయకులు ఎం.రాంబాబు , సంతోషం , డి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు


