Monday, 23 March 2026
  • Home  
  • సిపిఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
- ఖమ్మం

సిపిఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

సిపిఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి *జిల్లా అధికారులకు నిర్వహించిన సిపిఆర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్* ————————— ఖమ్మం, అక్టోబర్ -13: ————————— సిపిఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు సోమవారం నిర్వహించిన సిపిఆర్ అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* సమాజంలో ఇటీవల కాలంలో హర్ట్ ఎటాక్ వల్ల చాలా మంది మరణిస్తున్నారని, హర్ట్ ఎటాక్ వచ్చిన వెంటనే సిపిఆర్ చేయడం వల్ల మనిషి ప్రాణాలు కాపాడేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. సిపిఆర్ చేసేందుకు వైద్య రంగంలో ఎటువంటి అనుభవం అవసరం లేదని, సాధారణ మనుషులు కూడా సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ సిపిఆర్ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. గోల్డెన్ అవర్ లో సిపిఆర్ చేయడం వల్ల ప్రాణాలు కాపాడ గలుగుతామని అన్నారు. మనిషి ఎప్పుడైనా స్పృహ కోల్పోతే వెంటనే సిపిఆర్ చేయాలని కలెక్టర్ సూచించారు. సిపిఆర్ ఒక లైఫ్ స్కిల్ అని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డి.ఆర్.ఓ. ఏ. పద్మశ్రీ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ బి. కళావతి బాయి, డిసిహెచ్ఎస్ డా. రాజశేఖర్, డిప్యూటీ డిఎం. అండ్ హెచ్ఓ చందూ నాయక్, ప్రోగ్రాం అధికారి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సిపిఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

*జిల్లా అధికారులకు నిర్వహించిన సిపిఆర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్*
—————————
ఖమ్మం, అక్టోబర్ -13:
—————————
సిపిఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.

జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు సోమవారం నిర్వహించిన సిపిఆర్ అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* సమాజంలో ఇటీవల కాలంలో హర్ట్ ఎటాక్ వల్ల చాలా మంది మరణిస్తున్నారని, హర్ట్ ఎటాక్ వచ్చిన వెంటనే సిపిఆర్ చేయడం వల్ల మనిషి ప్రాణాలు కాపాడేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు.

సిపిఆర్ చేసేందుకు వైద్య రంగంలో ఎటువంటి అనుభవం అవసరం లేదని, సాధారణ మనుషులు కూడా సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ సిపిఆర్ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. గోల్డెన్ అవర్ లో సిపిఆర్ చేయడం వల్ల ప్రాణాలు కాపాడ గలుగుతామని అన్నారు.

మనిషి ఎప్పుడైనా స్పృహ కోల్పోతే వెంటనే సిపిఆర్ చేయాలని కలెక్టర్ సూచించారు. సిపిఆర్ ఒక లైఫ్ స్కిల్ అని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో డి.ఆర్.ఓ. ఏ. పద్మశ్రీ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ బి. కళావతి బాయి, డిసిహెచ్ఎస్ డా. రాజశేఖర్, డిప్యూటీ డిఎం. అండ్ హెచ్ఓ చందూ నాయక్, ప్రోగ్రాం అధికారి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.