• జన్మ నామం సుహాసిని
• జననం 1961 ఆగస్టు 15 (వయస్సు 59)
• భర్త మణిరత్నం
• ప్రముఖ పాత్రలు సిరివెన్నెల,సంసారం ఒక చదరంగం, స్వాతి (సినిమా)
సుహాసిని ( 1961 ఆగస్టు 15) దక్షిణ భారత నటి. దర్శకుడు మణిరత్నంను వివాహమాడింది. తమిళనాడులో గల చెన్నై పట్టణంలో జన్మించింది. నటనలోనే కాకుండా కథకురాలిగా, నిర్మాతగా అనుభవముంది. ఈవిడ తొలిసారి 1980లో నెంజతై కిల్లతే అనే తమిళ చిత్రంలో నటించింది.
సుహాసిని, భారతీయ నటుడు కమల హాసన్ అన్న, నటుడు చారు హాసన్ కూతురు. 1988లో ఈమె ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నంను పెళ్ళిచేసుకున్నది. వీరికి 15 యేళ్ళ వయసున్న కొడుకు ఉన్నాడు.
1996లో, దర్శకత్వములో అడుగుపెట్టి, జి.వి.ఫిల్మ్స్ నిర్మించిన ఇందిర సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా సుహాసినినే సమకూర్చింది. ఈమె, ఈమె భర్త, తమ సొంత చిత్ర నిర్మాణ సంస్థ, మద్రాస్ టాకీస్ యొక్క నిర్వహణ పనులు చూసుకుంటూ ఉంటారు. మద్రాస్ టాకీస్ లో మణిరత్నం సోదరుడు కీ.శే. జి.శ్రీనివాసన్ కూడా ఉండేవారు. సుహాసిని 1985లో కె.బాలచందర్ దర్శకత్వము వహించిన తమిళ సినిమా సింధుభైరవిలో తన నటనకు గాను 1986లో ప్రతిష్ఠాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారము (ఉత్తమనటి) అవార్డు అందుకున్నది.
ఈమె తమిళ, తెలుగు, కన్నడతో పాటు మళయాళము భాషా చిత్రాలలో కూడా నటించింది. 1999లో ఎ.ఎఫ్.ఐ చిత్రోత్సవముకు ఎన్నికైన వానప్రస్థమ్ సినిమాలో సుహాసిని తన నటనకుగాను ప్రశంసలందుకున్నది.
చిత్రసమాహారం నటిగా
తెలుగు
• ఎంత మంచివాడవురా! (2020)
• సూర్యకాంతం (2019)
• సంగమం (నిర్మాణంలో ఉంది)
• శ్రీ మహాలక్ష్మి (2007)
• రాఖీ (2006)
• అమ్మ చెప్పింది (2006)
• షాక్ (2004)
• దొంగరాముడు అండ్ పార్టీ (2003)
• గెలుపు (2002)
• నువ్వు నాకు నచ్చావ్ (2001)
• సకుటుంబ సపరివార సమేతం (2000)
• రాజకుమారుడు (1999)
• ఊయల (1998)
• పెళ్లి పందిరి (1997)
• ఎగిరే పావురమా (1997)
• హలో గురూ (1996)
• శుభలగ్నం (1994)
• అక్క మొగుడు (1991)
• మరణ మృదంగం (1988)
• మంచి దొంగ (1988)
• ఆఖరి పోరాటం (1988)
• పున్నమి చంద్రుడు (1987)
• పుణ్యదంపతులు (1987)
• బావామరదళ్లు (1987)
• వారసుడొచ్చాడు (1987)
• ఆరాధన (1987)
• సంసారం ఒక చదరంగం (1987)
• తేనె మనసులు (1987)
• గౌతమి (1987)
• శ్రావణ సంధ్య (1986)
• రాక్షషుడు (1986)
• చంటబ్బాయ్ (1986)
• కిరాతకుడు (1986)
• మిస్టర్ భరత్ (1986)
• ముద్దుల మనవరాలు (1986)
• శాంతినివాసం (1986)
• సిరివెన్నెల (1986)
• స్రవంతి (1986)
• అర్జున్ 3D (1985)
• మహారాజు (1985)
• బుల్లెట్ (1985)
• జాకీ (1985)
• స్వాతి (1985)
• ఇంటిగుట్టు (1984)
• సర్దార్ (1984)
• ఛాలెంజ్ (1984)
• జస్టిస్ చక్రవర్తి (1984)
• మంగమ్మ గారి మనవడు (1984)
• ముక్కు పుడక (1984)
• మనిషికో చరిత్ర (1984)
• మగ మహారాజు (1983)
• మంచుపల్లకి (1982)
• కొత్త జీవితాలు (1981)
నిర్మాతగా
• ఇద్దరు (1997)
సేకరణ .


