



శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఇందిరానగర్ కోలనీ వద్దగల సిద్దాశ్రమంలో 201వ పవిత్ర శక్తి హోమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ శక్తి హోమం అనేది హిందూమతంలో అగ్నిని ఉపయోగించి చేసే ఒక పవిత్ర యాగమని, దీని ద్వారా దేవతా శక్తిని ఆరాధించడం జరుగుతుందని, ఈ హోమం చేయడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి రక్షణ, శత్రువులపై విజయం, శారీరక శుద్ధీకరణ, ఆరోగ్యం, విజయం కలుగుతాయన్నారు. ప్రతికూల శక్తుల నుండి రక్షణ, దుష్ట శక్తుల పీడ, మంత్ర విద్యల ప్రభావాల నుండి విముక్తి లభిస్తుందని, శత్రువులపై విజయం సాధించడంలో సహాయపడుతుందని, శారీరక, మానసిక శుద్ధీకరణ, హోమం చేయడం వల్ల శరీరం శుద్ధి చెంది, శక్తిని, ఆరోగ్యాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుందన్నారు. అనంతరం సిద్ధాశ్రమ నిర్మాణ, నిర్వహణలో ప్రధాన భూమిక నిర్వహించి, భక్తి, జ్ఞాన దిశగా సన్మార్గాన్ని చూపి, ఎన్నో క్షేత్ర, ధర్మ మార్గదర్శి అయిన కీర్తి శేషులు మణికంఠ గురుస్వామి (ఉర్లాం మురళీమోహన్ రావు) సంస్కరణ సభను నిర్వహించి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు, స్థానిక భక్తులు, సిద్ధాశ్రమం శిష్య బృందం తదితరులు పాల్గొన్నారు.

