పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 10 : విశ్వాసాలు, ధర్మాల పేరుతో చట్టాలను రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించకుండా దాడులు చేస్తామంటే సహించేది లేదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్ మాదిగ అన్నారు మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి బక్కని రవి మాదిగ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సీజే పై దాడి చేసి దళితుల ఆత్మగౌరవాన్నే కాకుండా న్యాయ వ్యవస్థ స్వతంత్రతను, గౌరవాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారని దీనికి వివక్షతనే ప్రధాన కారణమని ఆ వివక్షతను ఎదుర్కోవడానికే నవంబర్ 17న చలో ఢిల్లీ నిర్వహిస్తున్నామని ఈ ఢిల్లీకి యువతరం సిద్ధమై ఆత్మగౌరవ పోరాటంలో భాగం కావాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా ఇంచార్జి రాగళ్ల ఉపేందర్ మాదిగ పిలుపునిచ్చారు.భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ బిఆర్ గవాయ్ మీద దాడి జరిగితే ఈ దేశ వ్యవస్థలన్ని ఎలాంటి చర్యలకు ఉపక్రమించకుండా మౌనం వహించి అంటరానితనాన్ని ప్రదర్శించాయని అన్నారు. ఈ దేశ చట్టపరమైన వ్యవస్థలకు కూడా దళితులు అంటరానివారయ్యారని మండిపడ్డారు. గవాయి దళితుడు కావడం వల్లనే వ్యవస్థలన్నీ మౌనం వహించాయని , కానీ అదే స్థానంలో ఉన్నత వర్గాలకు చెందిన న్యాయమూర్తి ఉంటే ఇప్పటికే స్పందించి శిక్షలు వేసే వారని అన్నారు.దేశానికి అత్యున్నతమైన న్యాయ వ్యవస్థ అధిపతిగా ఉన్నా కూడా ఇంత కులవివక్షత పాటించడం అత్యంత అమానుషం అని అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని..? ఇలాంటి పరిస్థితుల్లో రక్షణ ఎక్కడ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే దళితుల ఆత్మగౌరవ ఉద్యమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ చట్టప్రకారం పని చేయాలని అన్నారు.దాడులకు పాల్పడ్డ వారు దాడులను సమర్థించుకుంటుంటే ,మళ్ళీ దాడులు చేస్తామని మాట్లాడుతున్న చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని గుర్తుచేశారు.విశ్వాసాల పేరుతో దాడులకు పాల్పడితే శిక్షలు వేయకపోవడం చట్టవిరుద్ధం అని విశ్వాసాల పేరుతో, ధర్మాల పేరుతో దళితుల మీద దాడికి పాల్పడితే కేసులు పెట్టరా ? శిక్షలు వేయారా? అరెస్టులు చేయరా ? ఇదేమి న్యాయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివక్షతను గట్టిగా ఎదుర్కోవడానికి ఈ నెల 17న మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఛలో డిల్లీకి పిలుపునిస్తున్నామని, రాజ్యాంగ రక్షణ కోసం ,దళితుల మీద దాడులు ఎదుర్కోవడం కోసం ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడే దేశానికే ఓ సంకేతనిద్దాం మన ఆస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని, న్యాయాన్ని కాపాడుకోవడం కోసం నవంబర్ 17న ఛలో డిల్లీకి దళితులు, పీడిత వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు పెంటనోళ్ళ నరసింహ మాదిగ, మండల అధ్యక్షులు ఎర్ర గణేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు బక్కని అశోక్ మాదిగ, అనిల్ మాదిగ, జోగు నాగభూషణం మాదిగ, కల్లేపల్లి బాలరాజు మాదిగ, సుమన్ మాదిగ, సిద్ధులు మాదిగ, వరుణ్ మాదిగ, ఎర్ర నవీన్ మాదిగ, సుదర్శన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

సిజే పై దాడికి నిరసనగా నవంబర్ 17న ఛలో ఢిల్లీ. —కులవివక్షతను ఎదుర్కోవడానికే దళిత ఆత్మగౌరవ పోరాటం. –ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్ మాదిగ