నెల్లూరు | నవంబర్ 2025 | పున్నమి ప్రతినిధి
విశాఖపట్నంలో నిర్వహించనున్న సిఐటియు (CITU) 18వ అఖిలభారత మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ, సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం వాల్ పోస్టర్‌లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కార్మికుల హక్కులు, జీవన భద్రత, కార్మిక చట్టాల పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ మహాసభలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని అన్నారు. కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని, మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


