*సిఐటియు అఖిలభారత మహాసభలు విజయవంతం చేయండి*
*సిఐటియు బీచ్ వాక్*
*విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి *
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) అఖిలభారత మహాసభలు 2025 డిసెంబరు 31 నుండి 2026 జనవరి 4 వరకు విశాఖలో జరుగుతున్న 18వ అఖిలభారత మహాసభలు విజయవంతం చేయాలని విశాఖ జిల్లా సిఐటియు పూర్వ కార్యదర్శి ఎ.అజశర్మ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 6.30 గంటలకు రామకృష్ణబీచ్ ఖాళీమాతా టెంపుల నుండి వైఎంసిఎ వరకు బీచ్వాక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు.. ఈ బీచ్వాక్ నుద్దేశించి అజశర్మ పాల్గొని మాట్లాడుతూ ఐక్యత పోరాటం నినాదంతో ఏర్పడిన సిఐటియు దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులను, కార్మిక సంఘాలను ఐక్యం చేసి పోరాటాలు చేపట్టిందన్నారు. దేశంలో కార్మికవర్గ సమస్యలపై నిఖరంగా పోరాడి అనేక విజయాలు సాధించి భారతదేశంలోనే అతిపెద్ద సంఘంగా ఏర్పడిందన్నారు. సిబటియు ఏర్పడి 55 ఏళ్ళ తరువాత ఆంధ్రరాష్ట్రంలో అఖిలభారత మహాసభలు జరుగుతున్నాయన్నారు. విశాఖలో, ఆంధ్రరాష్ట్రంలో కార్మికుల సమస్యలపై ఉద్యమిస్తుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్, డిసిఐ, షిప్యార్డు, బిహెచ్పివి వంటి అనేక ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు కట్టబెట్టే ప్రయత్నాలు అడ్డుకున్న ఏకైక సంఘం సిఐటియు అని అన్నారు. అసంఘటితరంగ కార్మికులు, స్కీం వర్కర్లు వంటి సమస్యలపైన, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు నాయకత్వం వహించడమే కాకుండా దేశంలో ఉండే కార్మిక సంఘాలను, మేధావులను, మధ్యతరగతి, ఎన్జిఓ సంఘాలను సైతం ఐక్యవేదికపై తెచ్చి పోరాడుతోందన్నారు. ఎన్నోపోరాటాలు, త్యాగాలు చేసిన సిఐటియు నాయకత్వం విశాఖపట్నానికి రావడం, ఇక్కడ 5రోజులు పాటు మహాసభలు జరపడం విశాఖ కార్మికవర్గానికి ఒకవరం. ఈ మహాసభలను విశాఖ కార్మికవర్గం, ప్రజానీకం సహాయ, సహాకారాలు అందించి విజయవంతం చేయాలని, 2026 జనవరి 4న విశాఖలో వేలాదిమందితో జరిగే ప్రదర్శన, బహిరంగసభలలో పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.ఎం. శ్రీనివాస్, ఆర్.కె.ఎస్.వి.కుమార్, నాయకులు కె.ఎం.కుమార్ మంగళం, ఎం.జగ్గునాయుడు, కె. లోకనాధం, బి.జగన్, జె. అయోధ్యరామ్, పి.వెంకటరావు, ఎం.సుబ్బారావు, అరుణ్, శ్రీనివాస్, కె.చంద్రశేఖర్, బి. వెంకటరావు నమ్మి రమణ, మాధవి, పద్మ, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.


