నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
నల్గొండ పట్టణంలోని ఎన్ జి కళాశాల మైదానంలో సింథటిక్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎన్జీ కళాశాల మైదానం నల్గొండకు ఒక మంచి గుర్తింపు అని అన్నారు. నల్గొండ కళాశాల మైదానంలో మంచి క్రీడా సౌకర్యం కల్పించే విషయంలో మున్సిపల్ లేదా జిల్లా యంత్రాంగం నిధులతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.


