యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి
*సాయుధ రైతాంగ పోరాట యోధుడు కాచం కృష్ణమూర్తి గారి స్ఫూర్తితో భూ పోరాటాలకు సిద్ధం కావాలి*
– *సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి జహంగీర్ పిలుపు*
భూమికోసం, భుక్తి కోసం, పీడిత తాడిత ప్రజల విముక్తి కోసం రాచరిక వ్యవస్థకు, ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా బక్క చిక్కిన పేదలను ఒక్కటి చేసి వారి చేత బంధుకూలు పట్టించి సాయుధ రైతాంగ పోరాటంలో ముందు నడిచిన పోరాట యోధుడు, వందలాది ఎకరాల భూములను పేదలకు పంచిన భూ పోరాటాల దిక్సూచి కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి గారి 19వ వర్ధంతి స్ఫూర్తితో పేదలు, వ్యవసాయ కూలీలు మరోసారి భూ పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి. జహంగీర్ పిలుపునిచ్చినారు.
శుక్రవారం సుందరయ్య భవన్, భువనగిరిలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి గారి 19వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించడం జరిగింది. అనంతరం ” భూ భారతి – భూ సమస్యలను పరిష్కరిస్తుందా ” అనే అంశంపై చర్చా వేదిక కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షతన నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ ఆనాడు వెట్టి చాకిరికి, దోపిడికి, బానిస విధానానికి ఆత్మగౌరవ పోరాటాలు, భూమి బుక్తి విముక్తి పోరాటాలు నిర్వహిస్తే ప్రజలు నేటి వరకు స్వేచ్ఛగా జీవిస్తున్న పరిస్థితి ఉన్నదని అన్నారు. కానీ దేశంలో అధికారంలో చేపట్టిన బిజెపి గత పది సంవత్సరాల్లో అనేక చట్టాలను మారుస్తూ ప్రజల హక్కులను కాలరాస్తూ రాజ్యాంగ స్ఫూర్తినే దెబ్బతీయాలనె కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. భారత దేశాన్ని దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేసి పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కూడా పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో దళారుల రక్షణ కోసం, కార్పొరేట్ శక్తులకు, భూస్వాములకు తిరిగి భూములను అప్పజెప్పడానికి ధరణి అనే చట్టాన్ని తెచ్చి రైతులను, పేదలను ఇబ్బందుల పాలు చేశారని విమర్శించారు. ధరణి చట్టం వల్ల అనేకమంది పేదలు నూతన పాసుబుక్కులు రాక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా దూరమయ్యారని ఆవేదన వెలిబుచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టంలో ఉన్న కొన్ని లోపాలను సరిచేసి చట్టాన్ని అమలు చేసి రాష్ట్రవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా పేదలు సాగు చేసుకుంటున్న భూములకు వెంటనే పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో కొనసాగుతున్న భూ పంపిణీ నిషేధం కూడా ఎత్తివేయాలని అన్నారు. ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములన్నిటిని సర్వే చేసి ఇండ్ల స్థలాలు లేని పేదలందరికీ 120 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని, రెండు ఎకరాలు చొప్పున సాగు భూమి ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. నాడు కృష్ణమూర్తి గారు కూలీల, రైతుల కార్మికుల సమస్యలపై పోరాడి అన్ని వర్గాల ప్రజా నాయకుడిగా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారని వారి స్ఫూర్తిని కొనసాగించడానికి ప్రజా పోరాటాలను ఉధృతం చేయాలని వారు సూచించారు. సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాచకొండ జనార్ధన్, బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్యలు మాట్లాడుతూ దళారుల రక్షణ కోసం తెచ్చిన ధరణి చట్టాన్ని రద్దుచేసి భూ భారతి చట్టాన్ని తేవడాన్ని స్వాగతిస్తున్నామని కానీ గత ప్రభుత్వం అనుసరించిన విధంగా ఈ ప్రభుత్వము తమ విధానాలను అమలు చేయొద్దని సూచించారు. ఇప్పటికైనా జిల్లా వ్యాప్తంగా భూమి లేని పేదలను గుర్తించి వారందరికీ ప్రభుత్వ భూములను పంచాలని అన్నారు. ప్రజల చేతికి భూమి వస్తేనే దరిద్రం పోతుందని, నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని, ప్రజల జీవన విధానంలో మార్పు వస్తుందని వారు తెలియజేసారు. దేశంలో నరరూప రాక్షసుడైన మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 ఆదివాసి గూడాల్లో ఐదు లక్షల ఎకరాల పైగా భూమి రక్షణ కోసం ఉద్యమాలు జరుగుతున్నాయని అన్నారు. ఆనాడు కామ్రేడ్ కృష్ణమూర్తి లాంటి వాళ్లు అనేకమంది ప్రజల పక్షాన పోరాడి హక్కులను చట్టాలను సాధించుకున్నారని అన్నారు. ఈనాటి పాలకులు ఆ చట్టాలను, హక్కులను కాలరాయడానికి కపట నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం రైతులు, కూలీలు, కార్మికులు, ప్రజలు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ, సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరి పాండు, ఐలు జిల్లా అధ్యక్షులు బొల్లెపల్లి కుమార్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి దయ్యాల నర్సింహ, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు కళ్లెపు అడవయ్య పాల్గొని మాట్లాడగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు, తిరందాసు గోపి విజ్ఞాన కేంద్రం ట్రస్టు అధ్యక్షులు గద్దె నర్సింహ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌలు, జిల్లా సహాయ కార్యదర్శి సిరిపంగి స్వామి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ , ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వీర్లపల్లి ముత్యాలు, సిపిఎం భువనగిరి పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ , రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి వడ్డబోయిన వెంకటేష్ , ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి వనం రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు సిలువేరు ఎల్లయ్య , కొండపురం యాదగిరి, నాయకులు కొండపురం పౌల్, మూడుగుల బాలరాజు, ఉప్పలయ్య , బండారి ప్రభాకర్, రాంబాబు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


