Saturday, 4 April 2026
  • Home  
  • సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ త్యాగస్ఫూర్తి యువతకు ఆదర్శం: –జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
- జనగాం

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ త్యాగస్ఫూర్తి యువతకు ఆదర్శం: –జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

* జనగామ, ఏప్రిల్2,పున్నమి ప్రతినిధి: గురువారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… సామాజిక సమానత్వం, న్యాయం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. పాపన్న గౌడ్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమనిఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలను స్మరించుకోవడం ద్వారా సమాజంలో మంచి విలువలు పెంపొందుతాయని *కలెక్టర్* తెలిపారు. అనంతరం అధికారులు, సిబ్బంది కూడా పాపన్న గౌడ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎన్. ఎల్. నరసింహ రావు, ఏబీసీడీఓ రవీందర్, డీఎల్పీఓ (ఇంచార్జి )వెంకట్ రెడ్డి, దిశ కమిటీ సభ్యులు బక్క శ్రీనివాస్, బీసీ కుర్మ సంఘం జనరల్ సెక్రటరీ జోయ మల్లేష్, వైద్యులు బిక్షపతి, బీసీ జేఏసీ అధ్యక్షులు, వసతి గృహ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

*

జనగామ, ఏప్రిల్2,పున్నమి ప్రతినిధి:
గురువారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… సామాజిక సమానత్వం, న్యాయం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు.

పాపన్న గౌడ్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమనిఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలను స్మరించుకోవడం ద్వారా సమాజంలో మంచి విలువలు పెంపొందుతాయని *కలెక్టర్* తెలిపారు.

అనంతరం అధికారులు, సిబ్బంది కూడా పాపన్న గౌడ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎన్. ఎల్. నరసింహ రావు, ఏబీసీడీఓ రవీందర్, డీఎల్పీఓ (ఇంచార్జి )వెంకట్ రెడ్డి, దిశ కమిటీ సభ్యులు బక్క శ్రీనివాస్, బీసీ కుర్మ సంఘం జనరల్ సెక్రటరీ జోయ మల్లేష్, వైద్యులు బిక్షపతి, బీసీ జేఏసీ అధ్యక్షులు, వసతి గృహ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.