Monday, 23 March 2026
  • Home  
  • సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించిన బీజేపీ నాయకులు
- విశాఖపట్నం

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించిన బీజేపీ నాయకులు

శుక్రవారం బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు ఎం ఎం ఎన్ పరశు రామ రాజు ఆధ్వర్యంలో సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి 150 వ జయంతి సందర్భంగా వాల్తేర్ క్లబ్ ఎదురుగా ఉన్న సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎం ఎం ఎన్ పరశు రామ రాజు మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ ప్రజలందరి గుండెల్లో చిరస్మరణీయుడుగా నిలిచిపోయే వ్యక్తి అని కొనియాడారు. సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ గారు తన చాణక్య నీతితో 562 సంస్థానాలను విలీనం చేసి భారతదేశాన్ని ఒకటిగా చేసారు అన్నారు. మన దేశానికి స్వాతంత్య్రం రావడమనేది ఎంతోమంది త్యాగధనుల పోరాట ఫలితం అని అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, మౌలానా ఆజాద్ లాంటి అమరవీరులు త్యాగ ఫలాన్ని చిన్నదిగా చూపించి, స్వాతంత్య్రం తరువాత ఏర్పడిన ప్రభుత్వాలు ఒక కుటుంబాన్ని మాత్రమే ప్రచారం చేస్తూ దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలు అన్నిటికి ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల పేర్లను మాత్రమే పెట్టడం జరిగిందని అన్నారు. ఈ సంప్రదాయాన్ని సరిదిద్దే క్రమంలో మోడీ ప్రధానమంత్రి అయిన వెంటనే గాంధీజీ జన్మదినమైన అక్టోబర్ 2 ను స్వచ్ఛత దివస్ గాను, దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జన్మదినమైన సెప్టెంబర్ 25 ను అంత్యోదయ దివస్ గాను, సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి జన్మదినమైన అక్టోబర్ 31 ను రాష్ట్రీయ ఐక్యత దివస్ గాను పాటిస్తూ ప్రపంచంలోనే అతి ఎత్తైన సర్ధార్ వల్లభ్ భాయ్ గారి 182 మీటర్ల ఎత్తైన భవ్య విగ్రహాన్ని నిర్మించి, ఆ విగ్రహాన్ని ప్రధాన మంత్రి స్వయంగా ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అక్టోబర్ 31 వ తేదీన సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశమంతటా ఎంతో ఘనంగా జరుపుతుందని అన్నారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టారని, భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించి, రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించారు అని తెలిపారు. అనేక సంస్థానాలను భారత దేశంలో విలీనం చేయడానికి కృషి చేసి అందుకు సహకరించని వారి మీద మిలటరీ చర్యలకు కూడా వెనుకాడకుండా ఈనాటి భౌగోళిక భారత దేశం ఏర్పడటానికి ముఖ్య కారకులయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మిడి సుజాత రాజ్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి ఎం నాగేంద్ర, బీజేపీ పార్వతీపురం జిల్లా ఇంచార్జి ఎస్ వి ఎస్ ప్రకాష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కే ఎన్ పి చక్రవర్తి, బీజేపపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం ధనేశ్వర రావు, దాడి పురుషోత్తం రమేష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు డి కృష్ణంరాజు, తలాడ గిరిజ, బీజేపీ జిల్లా కార్యదర్శి లెంక శ్రీరామ్, కారుభుక్త పద్మ, టి భారతి ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొని సర్దార్ వల్లభ్ భాయ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

శుక్రవారం బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు ఎం ఎం ఎన్ పరశు రామ రాజు ఆధ్వర్యంలో సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి 150 వ జయంతి సందర్భంగా వాల్తేర్ క్లబ్ ఎదురుగా ఉన్న సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎం ఎం ఎన్ పరశు రామ రాజు మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ ప్రజలందరి గుండెల్లో చిరస్మరణీయుడుగా నిలిచిపోయే వ్యక్తి అని కొనియాడారు. సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ గారు తన చాణక్య నీతితో 562 సంస్థానాలను విలీనం చేసి భారతదేశాన్ని ఒకటిగా చేసారు అన్నారు. మన దేశానికి స్వాతంత్య్రం రావడమనేది ఎంతోమంది త్యాగధనుల పోరాట ఫలితం అని అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, మౌలానా ఆజాద్ లాంటి అమరవీరులు త్యాగ ఫలాన్ని చిన్నదిగా చూపించి, స్వాతంత్య్రం తరువాత ఏర్పడిన ప్రభుత్వాలు ఒక కుటుంబాన్ని మాత్రమే ప్రచారం చేస్తూ దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలు అన్నిటికి ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల పేర్లను మాత్రమే పెట్టడం జరిగిందని అన్నారు. ఈ సంప్రదాయాన్ని సరిదిద్దే క్రమంలో మోడీ ప్రధానమంత్రి అయిన వెంటనే గాంధీజీ జన్మదినమైన అక్టోబర్ 2 ను స్వచ్ఛత దివస్ గాను, దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జన్మదినమైన సెప్టెంబర్ 25 ను అంత్యోదయ దివస్ గాను, సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి జన్మదినమైన అక్టోబర్ 31 ను రాష్ట్రీయ ఐక్యత దివస్ గాను పాటిస్తూ ప్రపంచంలోనే అతి ఎత్తైన సర్ధార్ వల్లభ్ భాయ్ గారి 182 మీటర్ల ఎత్తైన భవ్య విగ్రహాన్ని నిర్మించి, ఆ విగ్రహాన్ని ప్రధాన మంత్రి స్వయంగా ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అక్టోబర్ 31 వ తేదీన సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశమంతటా ఎంతో ఘనంగా జరుపుతుందని అన్నారు.

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టారని, భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించి, రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించారు అని తెలిపారు. అనేక సంస్థానాలను భారత దేశంలో విలీనం చేయడానికి కృషి చేసి అందుకు సహకరించని వారి మీద మిలటరీ చర్యలకు కూడా వెనుకాడకుండా ఈనాటి భౌగోళిక భారత దేశం ఏర్పడటానికి ముఖ్య కారకులయ్యారని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మిడి సుజాత రాజ్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి ఎం నాగేంద్ర, బీజేపీ పార్వతీపురం జిల్లా ఇంచార్జి ఎస్ వి ఎస్ ప్రకాష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కే ఎన్ పి చక్రవర్తి, బీజేపపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం ధనేశ్వర రావు, దాడి పురుషోత్తం రమేష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు డి కృష్ణంరాజు, తలాడ గిరిజ, బీజేపీ జిల్లా కార్యదర్శి లెంక శ్రీరామ్, కారుభుక్త పద్మ, టి భారతి ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొని సర్దార్ వల్లభ్ భాయ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.