Thursday, 5 February 2026
  • Home  
  • సమస్యలు పరిష్కారంకి ఈ నెల 22 నుండి సమ్మెలోకి : ఆసుపత్రి శానిటేషన్ కార్మికులు వేతనాలు పెంచుతూ జారి చేసిన జీవో ప్రకారం 2024ఎరియర్స్ చెల్లించాలి సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు డిమాండ్
- అల్లూరి సీతారామరాజు

సమస్యలు పరిష్కారంకి ఈ నెల 22 నుండి సమ్మెలోకి : ఆసుపత్రి శానిటేషన్ కార్మికులు వేతనాలు పెంచుతూ జారి చేసిన జీవో ప్రకారం 2024ఎరియర్స్ చెల్లించాలి సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు డిమాండ్

అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్: ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సానిటేషన్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని సానిటేషన్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం అరకులోయ ఏరియా ఆసుపత్రి ముందు సీఐటీయు అద్వర్యంలో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. సానిటేషన్ కార్మికులు సమస్యల పరిష్కారం కొరకు ఈనెల 22 తేదీ నుండి సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు. అంతకుముందు ఉన్నతాధికారుల ద్వారా కంట్రాక్టర్ కు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని ప్రభుత్వ హాస్పటల్ శానిటేషన్ & సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి రఘు తెలిపారు. 2024 సంవత్సరంలో వేతనాలు రూ.18600 లకు పెంచుతూ వచ్చిన జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు హాజరై మాట్లాడారు. వేతనాలు పెంచుతున్నట్లు వచ్చిన జీవో ప్రకారం 2024 ఏరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కొత్తవారికి పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, జీతాలు కి ఎఫ్ ఆర్ ఎస్ లింకు పెట్టొద్దని తెలిపారు. కార్మికులకు సకాలంలో జీతాలు రాకపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కావున ప్రతినెల ఒకటో తారీఖున వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, డ్యూటీ చార్ట్ ఏర్పాటు చేసి అదనపు పనులు అప్పగించరాదని డిమాండ్ చేశారు. టెండర్ విధానం రద్దుచేసి ప్రభుత్వమే వేతనం లు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా అనేక సందర్భాల్లో ఉన్నతాధికారులకు సమస్యలు పరిష్కరించాలని విన్నవించిన పట్టించుకోలేదని అందుకే సమ్మెలోకి వెళుతున్నట్లు తెలియజేశారు.

అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సానిటేషన్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని సానిటేషన్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం అరకులోయ ఏరియా ఆసుపత్రి ముందు సీఐటీయు అద్వర్యంలో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. సానిటేషన్ కార్మికులు సమస్యల పరిష్కారం కొరకు ఈనెల 22 తేదీ నుండి సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు. అంతకుముందు ఉన్నతాధికారుల ద్వారా కంట్రాక్టర్ కు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని ప్రభుత్వ హాస్పటల్ శానిటేషన్ & సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి రఘు తెలిపారు. 2024 సంవత్సరంలో వేతనాలు రూ.18600 లకు పెంచుతూ వచ్చిన జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు హాజరై మాట్లాడారు. వేతనాలు పెంచుతున్నట్లు వచ్చిన జీవో ప్రకారం 2024 ఏరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కొత్తవారికి పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, జీతాలు కి ఎఫ్ ఆర్ ఎస్ లింకు పెట్టొద్దని తెలిపారు. కార్మికులకు సకాలంలో జీతాలు రాకపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కావున ప్రతినెల ఒకటో తారీఖున వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, డ్యూటీ చార్ట్ ఏర్పాటు చేసి అదనపు పనులు అప్పగించరాదని డిమాండ్ చేశారు. టెండర్ విధానం రద్దుచేసి ప్రభుత్వమే వేతనం లు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా అనేక సందర్భాల్లో ఉన్నతాధికారులకు సమస్యలు పరిష్కరించాలని విన్నవించిన పట్టించుకోలేదని అందుకే సమ్మెలోకి వెళుతున్నట్లు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.