Monday, 23 March 2026
  • Home  
  • సత్యనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా మార్గశిర పౌర్ణమి!
- విశాఖపట్నం

సత్యనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా మార్గశిర పౌర్ణమి!

సత్యనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా మార్గశిర పౌర్ణమి! *విశాఖపట్నం డిసెంబర్ 4పున్నమి ప్రతినిధి* పూర్ణ మార్కెట్ ఇసుక కొండ పై వేంచేసియున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో గురువారం నాడు మార్గశిర పౌర్ణమి వైభవంగా జరిగింది. శ్రీ పాంచరాత్ర ఆగమ సంప్రదాయంలో ఆలయ ప్రధాన అర్చకులు పి నరసింహచార్యులు స్వామివారికి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 4:00 గంటల నుండి భక్తులందరూ ముందుగా ధ్వజస్తంభాన్ని మ్రొక్కి ఐదు ప్రదక్షణలు చేసినంతరం స్వామివారిని దర్శించుకున్నారు. మూడు బ్యాచ్ లలో మొత్తం 167 సత్యనారాయణ స్వామి వ్రతములు జరిగాయి. వ్రతంలో పాల్గొన్న దంపతులకు శేష వస్త్రం, స్వామి వారి ఫోటో, నూక ప్రసాదం అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. మధ్యాహ్నం 1000 మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించామని ఆలయ ఈఓ టి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

సత్యనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా మార్గశిర పౌర్ణమి!
*విశాఖపట్నం డిసెంబర్ 4పున్నమి ప్రతినిధి*
పూర్ణ మార్కెట్ ఇసుక కొండ పై వేంచేసియున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో గురువారం నాడు మార్గశిర పౌర్ణమి వైభవంగా జరిగింది. శ్రీ పాంచరాత్ర ఆగమ సంప్రదాయంలో ఆలయ ప్రధాన అర్చకులు పి నరసింహచార్యులు స్వామివారికి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 4:00 గంటల నుండి భక్తులందరూ ముందుగా ధ్వజస్తంభాన్ని మ్రొక్కి ఐదు ప్రదక్షణలు చేసినంతరం స్వామివారిని దర్శించుకున్నారు. మూడు బ్యాచ్ లలో మొత్తం 167 సత్యనారాయణ స్వామి వ్రతములు జరిగాయి. వ్రతంలో పాల్గొన్న దంపతులకు శేష వస్త్రం, స్వామి వారి ఫోటో, నూక ప్రసాదం అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. మధ్యాహ్నం 1000 మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించామని ఆలయ ఈఓ టి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.