*సత్తుపల్లి మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు*
ఖమ్మం పున్నమి ప్రతినిధి
సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు జరిగాయి
సత్తుపల్లి నియోజకవర్గం లోని సత్తుపల్లి, వెంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండల కేంద్రాల్లో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.


