Friday, 27 March 2026
  • Home  
  • సత్తుపల్లి ఘటనపై ఖమ్మం సీపీకి జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులు జారీ
- ఖమ్మం

సత్తుపల్లి ఘటనపై ఖమ్మం సీపీకి జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులు జారీ

పువ్వాడ నాగేంద్ర కుమార్ ( తెలంగాణ పున్నమి ప్రతినిధి) బీసీ రిజర్వేషన్ బంద్ రోజున సత్తుపల్లి పట్టణంలో సత్తుపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షులు భూక్యా విజయ్ మీద మరియు బీజేపీ నాయకులు ల మీద డాడీ నేపథ్యంలో చోటుచేసుకున్న దుర్ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ ఖమ్మం జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) సునీల్ దత్ ని వివరణ కోరింది. బంద్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన విషయమై ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు, జాతీయ నాయకులు మరియు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ఇంచార్జి శ్రీ సుధాకర్ రెడ్డి పొంగులేటి చొరవతో ఈ ఫిర్యాదు జాతీయ ఎస్టీ కమిషన్‌ కు చేరింది. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన జాతీయ ఎస్టీ కమిషన్, ఖమ్మం కమిషనర్ ఆఫ్ పోలీస్ గారిని ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి యథార్థ నివేదికను తక్షణం సమర్పించాలని ఆదేశించింది. లేనిపక్షంలో సంబంధిత పోలీసు అధికారులు ఢిల్లీలోని జాతీయ ఎస్టీ కమిషన్ ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని కమిషన్ హెచ్చరించింది.

పువ్వాడ నాగేంద్ర కుమార్
( తెలంగాణ
పున్నమి ప్రతినిధి)

బీసీ రిజర్వేషన్ బంద్ రోజున సత్తుపల్లి పట్టణంలో సత్తుపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షులు భూక్యా విజయ్ మీద మరియు బీజేపీ నాయకులు ల మీద డాడీ నేపథ్యంలో చోటుచేసుకున్న దుర్ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ ఖమ్మం జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) సునీల్ దత్ ని వివరణ కోరింది. బంద్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన విషయమై ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు, జాతీయ నాయకులు మరియు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ఇంచార్జి శ్రీ సుధాకర్ రెడ్డి పొంగులేటి చొరవతో ఈ ఫిర్యాదు జాతీయ ఎస్టీ కమిషన్‌ కు చేరింది.
ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన జాతీయ ఎస్టీ కమిషన్, ఖమ్మం కమిషనర్ ఆఫ్ పోలీస్ గారిని ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి యథార్థ నివేదికను తక్షణం సమర్పించాలని ఆదేశించింది. లేనిపక్షంలో సంబంధిత పోలీసు అధికారులు ఢిల్లీలోని జాతీయ ఎస్టీ కమిషన్ ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని కమిషన్ హెచ్చరించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.