Tuesday, 9 December 2025
  • Home  
  • సచివాలయ సిబ్బందితో పీ-4 సమీక్ష నిర్వహించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు*
- విశాఖపట్నం

సచివాలయ సిబ్బందితో పీ-4 సమీక్ష నిర్వహించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు*

*విశాఖపట్నం, డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:- *సచివాలయ సిబ్బందితో పీ-4 సమీక్ష నిర్వహించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు* *ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజన్–2047 అమలుకు పీ-4 కీలకం* *బంగారు కుటుంబాల గుర్తింపులో పారదర్శకత తప్పనిసరి* *– రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు* *విశాఖపట్నం దివ్యదర్శిని న్యూస్* గాజువాక శాసన సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఈ రోజు గాజువాక జోన్–6 కార్యాలయంలో సచివాలయ సిబ్బందితో నిర్వహించిన P4 సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గంలో బంగారు కుటుంబాల గుర్తింపు పూర్తిగా పారదర్శకంగా, నిజాయితీగా, ఎవరికీ అన్యాయం జరగకుండా జరగాలని ఆయన స్పష్టంగా తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ప్రయోజనం ఆలస్యం లేకుండా చేరేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాల అధికారులను కోరారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజన్–2047 యొక్క ప్రధాన లక్ష్యం పేదరిక నిర్మూలన అని అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో P4 కీలక పాత్ర పోషిస్తుందని, ఇది కేవలం ఒక సర్వే మాత్రమే కాదు… ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకువచ్చే చారిత్రాత్మక కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి దీనిని బాధ్యతగా మాత్రమే కాదు, మన ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశంగా తీసుకోవాలని సూచించారు. పేదల కోసం ప్రభుత్వం పథకాలు ఇవ్వడం ఒక భాగమే. కానీ వారిని ఆర్థికంగా నిలబెట్టడం, స్వయంసమృద్ధి దిశగా నడిపించడం చంద్రబాబు గారి అసలు ధ్యేయమని పల్లా గారు అన్నారు. బంగారు కుటుంబాల గుర్తింపు కేవలం ఒక జాబితా తయారు చేయడం కాదని, వారికి అవసరమైన ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య సహాయం అందించి శాశ్వత పరిష్కారం చూపడమే అసలు లక్ష్యం అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం సొంత ఇంటిలోనా, అద్దె ఇంటిలోనా లేదా ఇతర వసతిలోనా నివసిస్తున్నారో స్పష్టంగా గుర్తించాలని సూచించారు. సొంత ఇల్లు ఉన్నపక్షంలో, ఆ భూమి ప్రభుత్వ భూమా, అసైన్డ్ (జెర్రిబట్టి) భూమా లేదా ఇతర వర్గంలోదా అనేది ఖచ్చితంగా నమోదు చేయాలని అన్నారు. అది ప్రభుత్వ భూమి అయితే, ఆ కుటుంబానికి పట్టా ఉందా లేదా అనే అంశాన్ని నిర్ధారించాల్సిందిగా సూచించారు. సంబంధిత భూమి వుడా భూమా, అభ్యంతర భూమా, ఏపీఐఐసీ భూమా, ప్రైవేట్ వివాద భూమా లేదా కార్పొరేషన్ భూమి కిందకు వస్తుందా అన్న వివరాలను కూడా స్పష్టంగా గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా, పెన్షన్‌కు అర్హులైన వ్యక్తులను, రేషన్ కార్డులకు అర్హులైన కుటుంబాలను వెంటనే గుర్తించి, అర్హత ఉన్న వారు ఎవరూ మిగలకుండా చూడాలని ఆయన ఆదేశించారు. అత్యవసర వైద్య శస్త్రచికిత్సలు అవసరమయ్యే వారి వివరాలను సేకరించి, సీఎంఆర్ఎఫ్ వంటి ప్రభుత్వ పథకాల ద్వారా వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని పల్లా గారు స్పష్టం చేశారు. ప్రతి ఇంటి పరిస్థితిని అర్థం చేసుకుని, వారికి అవసరమైన వనరులు కల్పించడం ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలిపారు. P4 సర్వే పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి పునాది వేస్తోందని, ఈ దశను పూర్తిస్థాయి బాధ్యతతో అమలు చేయాలని పల్లా గారు సిబ్బందిని ప్రోత్సహించారు

*విశాఖపట్నం, డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:-

*సచివాలయ సిబ్బందితో పీ-4 సమీక్ష నిర్వహించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు*
*ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజన్–2047 అమలుకు పీ-4 కీలకం*
*బంగారు కుటుంబాల గుర్తింపులో పారదర్శకత తప్పనిసరి*
*– రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు*

*విశాఖపట్నం దివ్యదర్శిని న్యూస్* గాజువాక శాసన సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఈ రోజు గాజువాక జోన్–6 కార్యాలయంలో సచివాలయ సిబ్బందితో నిర్వహించిన P4 సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

గాజువాక నియోజకవర్గంలో బంగారు కుటుంబాల గుర్తింపు పూర్తిగా పారదర్శకంగా, నిజాయితీగా, ఎవరికీ అన్యాయం జరగకుండా జరగాలని ఆయన స్పష్టంగా తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ప్రయోజనం ఆలస్యం లేకుండా చేరేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాల అధికారులను కోరారు.

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజన్–2047 యొక్క ప్రధాన లక్ష్యం పేదరిక నిర్మూలన అని అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో P4 కీలక పాత్ర పోషిస్తుందని, ఇది కేవలం ఒక సర్వే మాత్రమే కాదు… ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకువచ్చే చారిత్రాత్మక కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి దీనిని బాధ్యతగా మాత్రమే కాదు, మన ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశంగా తీసుకోవాలని సూచించారు.

పేదల కోసం ప్రభుత్వం పథకాలు ఇవ్వడం ఒక భాగమే. కానీ వారిని ఆర్థికంగా నిలబెట్టడం, స్వయంసమృద్ధి దిశగా నడిపించడం చంద్రబాబు గారి అసలు ధ్యేయమని పల్లా గారు అన్నారు. బంగారు కుటుంబాల గుర్తింపు కేవలం ఒక జాబితా తయారు చేయడం కాదని, వారికి అవసరమైన ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య సహాయం అందించి శాశ్వత పరిష్కారం చూపడమే అసలు లక్ష్యం అని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం సొంత ఇంటిలోనా, అద్దె ఇంటిలోనా లేదా ఇతర వసతిలోనా నివసిస్తున్నారో స్పష్టంగా గుర్తించాలని సూచించారు. సొంత ఇల్లు ఉన్నపక్షంలో, ఆ భూమి ప్రభుత్వ భూమా, అసైన్డ్ (జెర్రిబట్టి) భూమా లేదా ఇతర వర్గంలోదా అనేది ఖచ్చితంగా నమోదు చేయాలని అన్నారు. అది ప్రభుత్వ భూమి అయితే, ఆ కుటుంబానికి పట్టా ఉందా లేదా అనే అంశాన్ని నిర్ధారించాల్సిందిగా సూచించారు. సంబంధిత భూమి వుడా భూమా, అభ్యంతర భూమా, ఏపీఐఐసీ భూమా, ప్రైవేట్ వివాద భూమా లేదా కార్పొరేషన్ భూమి కిందకు వస్తుందా అన్న వివరాలను కూడా స్పష్టంగా గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా, పెన్షన్‌కు అర్హులైన వ్యక్తులను, రేషన్ కార్డులకు అర్హులైన కుటుంబాలను వెంటనే గుర్తించి, అర్హత ఉన్న వారు ఎవరూ మిగలకుండా చూడాలని ఆయన ఆదేశించారు. అత్యవసర వైద్య శస్త్రచికిత్సలు అవసరమయ్యే వారి వివరాలను సేకరించి, సీఎంఆర్ఎఫ్ వంటి ప్రభుత్వ పథకాల ద్వారా వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని పల్లా గారు స్పష్టం చేశారు. ప్రతి ఇంటి పరిస్థితిని అర్థం చేసుకుని, వారికి అవసరమైన వనరులు కల్పించడం ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలిపారు. P4 సర్వే పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి పునాది వేస్తోందని, ఈ దశను పూర్తిస్థాయి బాధ్యతతో అమలు చేయాలని పల్లా గారు సిబ్బందిని ప్రోత్సహించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.