(అక్టోబర్ 17)
**చరిత్రలో మరుపురాని చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు**
దక్షిణ భారతదేశ హిందూ సామ్రాజ్య స్థాపకుడు ..
చత్రపతి శివాజీ కన్నా ముందే హిందూ ధర్మ రక్షణకు కృషిచేసి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన రక్షకుడు…
మహావీరుడు ధైర్యవంతుడు సకల కళా పారంగతుడు …
ప్రపంచ దేశాలలో భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన విజేత …
శ్రీకృష్ణదేవరాయలతోతలపడడానికి భయపడిన మొగల్ రాజు అక్బర్
పది లక్షల సైన్యంతో గజబలం అశ్వ బలం తో పాటు ఫిరంగులు ఎక్కువగా కలిగిన రాజుగా పటిష్ట భద్రతను ఏర్పరిచి 20 సంవత్సరాల పాటు స్వర్ణయుగంగా పరిపాలించారు..
సంవత్సరానికి 240 కోట్ల వార్షికాదాయము కలిగిన దేశంగా ప్రపంచంలో విజయనగర సామ్రాజ్యానికి గుర్తింపు తెచ్చిన ఆర్థిక వేత్త
ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన ప్రాంతంగా హంపి పట్టణ నిర్మాణం.. హంపి బజారులో ముత్యాలు రత్నాలు వజ్రవైఢూర్యాలు రాశులు పోసి అమ్మిన వైనం. .
ముఖ్యంగా తిరుమల వెంకట నాథుడి ప్రియ భక్తుడు ..
ఆలయాలను నిర్మించి వాటినీ సంరక్షించిన యోధుడు ..ఆలయాలకు ముందు రాయ గోపుర నిర్మాణం ప్రారంభించిన మహనీయుడు…
సాహితీ సమరాంగణ చక్రవర్తి తెలుగు భాషకు ఐదు వందల సంవత్సరాల క్రితమే అత్యంత పేరు తెచ్చిన మహోన్నత వ్యక్తి …
దేశభాషలందు తెలుగు లెస్స అని చాటిన గొప్ప తెలుగు భాషాభిమాని …
అష్ట దిగ్గజాలు పేరుతో ఎనిమిది మంది తెలుగు కవులను తన ఆస్థానంలో ఆశ్రయం కల్పించిన కవిరాజు …
భువన విజయం వేదికగా సంస్కృతం తెలుగు కన్నడ తమిళ మలయాళ భాషల కవులకు సముచిత స్థానం ఇచ్చిన మహోన్నతుడు
యుద్ధాలలో తనే స్వయంగా సైన్యానికి నాయకత్వం వహించి విజయాలు సాధించిన ధీరుడు …
తన విజయాలతో రాజ్యాన్ని *విజయనగర రాజ్యం *గా మార్చివేసిన మహనీయుడు…
రైతు శ్రేయస్సు కోసం అనేక చెరువులు, నీటి నిర్మాణాలు చేపట్టిన రైతు బాంధవుడు. వ్యాపారులను ప్రోత్సహించిన ఆర్థికవేత్త. స్వయంగా కావ్యాలు రచించిన మహాకవి…
కులమత భేదాలను రూపుమాపి తన రెండవ రాణి వెనుకబడిన తరగతులకు చెందిన దేవదాసి, నర్తకి అయిన చిన్నా దేవిని వివాహం చేసుకున్న ఆదర్శప్రాయుడు.
ఈ ఆలయం చూసినా ఏ చెరువు చూసినా ఇది శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినవే అనే భావన నేటికీ పదిలంగా ఉంచిన మహనీయుడు. ఎంతోమంది పాలకులకు ఆదర్శప్రాయుడు.
శ్రీ శ్రీ శ్రీ కృష్ణదేవరాయ చక్రవర్తి 496వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, *కాపు సంక్షేమ సంఘం* చిలకలూరిపేట 🙏


