చిట్వేల్ మండలం నగిరిపాడు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ రంగనాయకుల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు వైభవంగా నిర్వహించబడనున్నాయి. ఈ సందర్భంగా సంప్రదాయ ప్రకారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం వేలంపాట కార్యక్రమం స్వామివారి సన్నిధిలో భక్తుల సమక్షంలో జరిగింది.ఈ వేలంపాటలో కుమ్మరిపల్లె వాస్తవ్యులైన కట్టా కృష్ణయ్య గారి కుమారుడు కట్టా ప్రసాద్ రూ.1,15,000 (ఒక లక్ష పదిహేనువేలు)కు వేలం దక్కించుకున్నారు.వేలంపాట అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కట్టా ప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు. వేద పండితులు కే. రంగాచార్యులు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ చైర్మన్ పోలిన నాగేశ్వరయ్య పూలమాల మరియు శాలువాతో సన్మానించారు.
బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సహకరించాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది.

శ్రీ శ్రీ రంగనాయకుల స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలంపాట నిర్వహణ
చిట్వేల్ మండలం నగిరిపాడు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ రంగనాయకుల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు వైభవంగా నిర్వహించబడనున్నాయి. ఈ సందర్భంగా సంప్రదాయ ప్రకారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం వేలంపాట కార్యక్రమం స్వామివారి సన్నిధిలో భక్తుల సమక్షంలో జరిగింది.ఈ వేలంపాటలో కుమ్మరిపల్లె వాస్తవ్యులైన కట్టా కృష్ణయ్య గారి కుమారుడు కట్టా ప్రసాద్ రూ.1,15,000 (ఒక లక్ష పదిహేనువేలు)కు వేలం దక్కించుకున్నారు.వేలంపాట అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కట్టా ప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు. వేద పండితులు కే. రంగాచార్యులు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ చైర్మన్ పోలిన నాగేశ్వరయ్య పూలమాల మరియు శాలువాతో సన్మానించారు. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సహకరించాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది.

