Monday, 23 March 2026
  • Home  
  • శ్రీ త్రికోటేశ్వరలో ఘనంగా ముందస్తు విజయదశమి వేడుకలు
- E-పేపర్

శ్రీ త్రికోటేశ్వరలో ఘనంగా ముందస్తు విజయదశమి వేడుకలు

సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి) విజయదశమి సందర్భంగా చేజర్ల మండలం ఆదురుపల్లిలోని శ్రీ త్రికోటేశ్వర విద్యాలయంలో దశరా ముందస్తు వేడుకలు సుప్రియ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దుర్గామాత ప్రతిమ అలంకరణ, మహిషాసుర వధ, రామాయణ దృశ్యరూపం చివరగా రావణాసుర దహనం వంటి కార్యక్రమాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. విద్యార్థినులు నవ దుర్గా వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలలో మహిషాసురుని వధ మరియు రావణుడిపై రాముడు సాధించిన విజయానికి గుర్తుగా రావణ దహనం కార్యక్రమాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మీనరసారెడ్డి, డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య మాట్లాడుతూ చెడు మీద మంచి గెలిచిన తీరుకు ప్రతీకగా విజయ దశమి పండుగ జరుపుకుంటామనీ, విద్యార్థులందరూ మంచి మార్గంలో నడిచి ఉన్నత శిఖరాలను అందుకోవాలని అందరికీ దశరా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక వేషధారణ వేసిన బాల బాలికలను బహుమతులతో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు బాల బాలికలు పాల్గొన్నారు.

సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి)

విజయదశమి సందర్భంగా చేజర్ల మండలం ఆదురుపల్లిలోని శ్రీ త్రికోటేశ్వర విద్యాలయంలో దశరా ముందస్తు వేడుకలు సుప్రియ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దుర్గామాత ప్రతిమ అలంకరణ, మహిషాసుర వధ, రామాయణ దృశ్యరూపం చివరగా రావణాసుర దహనం వంటి కార్యక్రమాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. విద్యార్థినులు నవ దుర్గా వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలలో మహిషాసురుని వధ మరియు రావణుడిపై రాముడు సాధించిన విజయానికి గుర్తుగా రావణ దహనం కార్యక్రమాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మీనరసారెడ్డి, డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య మాట్లాడుతూ చెడు మీద మంచి గెలిచిన తీరుకు ప్రతీకగా విజయ దశమి పండుగ జరుపుకుంటామనీ, విద్యార్థులందరూ మంచి మార్గంలో నడిచి ఉన్నత శిఖరాలను అందుకోవాలని అందరికీ దశరా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక వేషధారణ వేసిన బాల బాలికలను బహుమతులతో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు బాల బాలికలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.