ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌళిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) చైర్మన్ ఎం.రామరాజు శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ డైరెక్టర్ ముకుంద రెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి, పారిశ్రామికవాడ ప్రగతి, ప్రత్యేకతలను వివరించారు. రామరాజు ఎంతో ఆసక్తితో శ్రీసిటీలోని వివిధ అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. సమావేశం అనంతరం శ్రీసిటీ పరిసరాలలో పర్యటించి పారిశ్రామిక కార్యకలాపాలను వీక్షించారు. పెప్సికో పరిశ్రమను సందర్శించి ఉత్పత్తులను పరిశీలించారు.
రామరాజు పర్యటనను తాము గౌరవప్రదంగా భావిస్తున్నామని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీఐఐసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇది మొట్టమొదటి శ్రీసిటీ సందర్శన కాగా, ఆయన పరిశీలనలు, సూచనలు తమకెంతో విలువైనదంటూ తన సందేశంలో పేర్కొన్నారు.
ఏపీఐఐసీ చైర్మన్ తో పాటు ఏపీఐఐసి జోనల్ మేనేజర్ విజయ భరత్ రెడ్డి ఈ పర్యటనలో పాల్గొన్నారు.