Friday, 6 February 2026
  • Home  
  • శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల దీక్ష దిగ్విజయంగా పూర్తిచేసుకున్న స్వాములు – శబరిమలకు బయలుదేరిన భక్తులు
- విశాఖపట్నం

శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల దీక్ష దిగ్విజయంగా పూర్తిచేసుకున్న స్వాములు – శబరిమలకు బయలుదేరిన భక్తులు

విశాఖపట్నం: శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో భక్తజనుల సమక్షంలో నిర్వహించిన మండల పూజా దీక్షలను స్వాములు భక్తిశ్రద్ధలతో పూర్తిచేశారు. దీక్షావ్రతం విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో నేడు స్వాములు ఇరుముడి కట్టుకు సంబంధించిన పవిత్ర కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి శబరిమల యాత్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ— “అయ్యప్ప స్వామి అనుగ్రహంతో మా మండల దీక్షను ఎంతో భక్తి, నియమ నిష్ఠలతో పూర్తిచేసుకున్నాం. అలాగే అయ్యప్ప కృపా కటాక్షాలతో శబరిమల యాత్రను సాఫల్యంగా పూర్తి చేసుకుని స్వామివారి ఆశీర్వాదం పొందుతామని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం” అని తెలిపారు. అదేవిధంగా, దేవాలయ పీఠం ఆధ్వర్యంలో మండల కాలమంతా శాస్త్రబద్ధంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు, బిక్షా ప్రసాదాలు, సేవలకు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. “పీఠం అందించిన సేవల ద్వారా అయ్యప్ప అనుగ్రహానికి పాత్రులమయ్యామనిపించింది” అని స్వాములు పేర్కొన్నారు. యాత్రను సుభక్షితంగా పూర్తిచేసుకుని స్వామివారి దర్శనానందం పొందాలని మరెన్నో మంది భక్తులు శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామియే శరణం అయ్యప్ప!

విశాఖపట్నం:
శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో భక్తజనుల సమక్షంలో నిర్వహించిన మండల పూజా దీక్షలను స్వాములు భక్తిశ్రద్ధలతో పూర్తిచేశారు. దీక్షావ్రతం విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో నేడు స్వాములు ఇరుముడి కట్టుకు సంబంధించిన పవిత్ర కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి శబరిమల యాత్రకు బయలుదేరారు.

ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ—
“అయ్యప్ప స్వామి అనుగ్రహంతో మా మండల దీక్షను ఎంతో భక్తి, నియమ నిష్ఠలతో పూర్తిచేసుకున్నాం. అలాగే అయ్యప్ప కృపా కటాక్షాలతో శబరిమల యాత్రను సాఫల్యంగా పూర్తి చేసుకుని స్వామివారి ఆశీర్వాదం పొందుతామని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం” అని తెలిపారు.

అదేవిధంగా, దేవాలయ పీఠం ఆధ్వర్యంలో మండల కాలమంతా శాస్త్రబద్ధంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు, బిక్షా ప్రసాదాలు, సేవలకు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. “పీఠం అందించిన సేవల ద్వారా అయ్యప్ప అనుగ్రహానికి పాత్రులమయ్యామనిపించింది” అని స్వాములు పేర్కొన్నారు.

యాత్రను సుభక్షితంగా పూర్తిచేసుకుని స్వామివారి దర్శనానందం పొందాలని మరెన్నో మంది భక్తులు శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామియే శరణం అయ్యప్ప!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.