శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 10: శ్రీకాళహస్తీశ్వరాలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన చర్యలపై శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ నూతన ఈవో వెంకటేశ్వర రావు సుదీర్ఘంగా చర్చించారు. మంగళవారం ఎమ్మెల్యే నివాసంలో ఈవో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలయానికి సంబంధించిన పలు కీలక అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యటించే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా క్యూ లైన్ల నిర్వహణ, తాగునీరు, పారిశుధ్యం, వసతి గదుల ఆధునీకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఈవోకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. ఆలయ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఆలయ పరిసరాలను తీర్చిదిద్దాలని ఈ భేటీలో నిర్ణయించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సూచనల మేరకు రాహు-కేతు పూజలకు వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేస్తామని, ఆలయ ప్రగతికి ఎమ్మెల్యే పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో దేవస్థాన అధికారులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తీశ్వరాలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో ఈవో భేటీ