ఢిల్లీలో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మంగళవారం నాడు ఆలయంలోని భద్రతా విభాగాలను పరిశీలించి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న భద్రత సిబ్బందితో మాట్లాడి, భక్తుల భద్రత కోసం తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, క్షుణ్ణమైన తనిఖీలు, సీసీ కెమెరా పర్యవేక్షణ, లగేజ్ స్కానింగ్, అత్యవసర ప్రతిస్పందన చర్యలు వంటి అంశాలపై సూచనలు చేసారు. ఈ సందర్బంగా ఆలయ పాలకమండలి చైర్మన్ మాట్లాడుతూ…ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ప్రతి భక్తుడి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఏ మాత్రం చిన్న సందేహ వచ్చినా వెంటనే పై అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. భద్రత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం తగదని, సెక్యూరిటీ సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చి, అన్ని ప్రవేశ ద్వారాల వద్ద భద్రతా తనిఖీలను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో ధర్మకర్త మండలి అధ్యక్షులు ఆలయ ఆవరణంలో షాపుల ఆకస్మిక తనిఖీలు చేశారు షాపులు యజమాన్యాలతో శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చే భక్తులకు భక్తి భావంతో నడుచుకోవాలని భక్తుల మీద వ్యాపారస్తులు అధికంగా భారం వెయ్యొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీకాళహస్తీశ్వరాలయంలో భద్రతా చర్యలపై చైర్మన్ పర్యవేక్షణ