పున్నమి ప్రతినిధి , శ్రీకాళహస్తి:
ఆంధ్రప్రదేశ్ ను ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాo : గౌ. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి*
సుమారుగా 22 కిలోమీటర్లు కలిగిన ఈ గిరిప్రదక్షిణ మార్గం రోడ్డు పనులను పూర్తి చేసి భక్తులందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాం : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్*
ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరి ప్రదక్షిణ మార్గమును ప్రజలకు అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తెచ్చాం : శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి*
గిరి ప్రదక్షిణ రోడ్డు మార్గాన్ని పూర్తి చేయడం సంతోషం : చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్*
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 13 : దేవాలయాలే మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని, గిరి ప్రదక్షణ చేసిన ప్రతి భక్తునికి కైలాసగిరి పుణ్యఫలం దక్కాలని గౌ.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
శుక్రవారం శ్రీకాళహస్తి స్వామి దేవస్థానంలో ఆలయ ఆవరణoలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్లాల్, శ్రీకాళహస్తి, తిరుపతి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆరని శ్రీనివాసులు, గిరి ప్రదక్షణ మార్గం శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమం వర్చువల్ గా ప్రారంభించగా.. తిరుపతి జిల్లా నుంచి శ్రీకాళహస్తి ఆలయం ప్రాంగణం నుంచి ఆలయం ఈ వో బాపిరెడ్డి, ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, హ్యాండ్ క్రాఫ్ట్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, బీజేపీ నాయకులు కోలా ఆనంద్, జిల్లా అటవీ శాఖ అధికారి సాయి ప్రసాద్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సెల్వం, అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ చెంచు నాయుడు, శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యుల తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్..
ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అని తెలిపారు. 42 ఆలయాలను గుర్తించి మహా శివరాత్రి పర్వదినాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాం అని తెలిపారు. మహా శివరాత్రి హిందూ ధర్మానికి, సనాతన ఆచారాలకు అనుగుణంగా జరుపుకుంటున్నాం అని ఈ సందర్భంగా శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ మార్గం ప్రారంభించడం ఆనందం కలిగించిందన్నారు.
హిందూ ధార్మిక సంస్థలు, సనాతన ధర్మ పరిరక్షణలో అందరికంటే ఒక అడుగు ముందుండే వ్యక్తి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
వారి ఆధ్వర్యంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం శుభసూచకమని తెలిపారు. కైలాసగిరి ప్రదక్షణ చేసే భక్తుల కోసం మార్గాన్ని ఏర్పాటు చేసి రెండు విభాగాలుగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. కూటమి ప్రభుత్వంలో దూప దీప నైవేధ్యం స్కీం కింద 5,821 ఆలయాలకు నెలకి రూ. 10 వేల చొప్పున పంపుతున్నామనాన్మని 2027 పుష్కరాల సందర్భంగా పురాతన ఆలయాల పరిరక్షణకు చర్యలు 495 ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమానికి రూ. 608 కోట్లు వెచ్చించి పనులు చేపట్టామని ఏజెన్సీ ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీవాణి ఆలయాల పేరిట టీటీడీ ఆర్ధిక సహకారంతో 5 వేల ఆలయాలకి రూ. 750 కోట్లు కేటాయించి చిన్న చిన్న ఆలయాలు నిర్మిస్తున్నాం అని తెలిపారు. ఇప్పటికి 697 ఆలయాలకు, 113.25 కోట్ల నిధులు మంజూరు చేస్తూ అనుమతులు ఇచ్చాం అని
1516 ఆలయాలకు పాలకవర్గాలు నియమించాల్సి ఉంటే 1,002 నియమించామని, మిగిలినవి కూడా నియామకాలు త్వరలో చేపడతామాని గోదావరి పుష్కరాల పేరిట 31 ప్రధాన ఆలయాలను రూ. 37 కోట్లతో అభివృద్ధి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ను ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
శ్రీకాళహస్తి దేవస్థానం అభివృద్ధి, గిరి ప్రదక్షణ మార్గం నిర్మాణం మరియు ఆలయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గిరి ప్రదక్షణ మార్గ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగిందని తెలిపారు. 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షణ మార్గ అభివృద్ధికి సుమారు రూ.10 కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు అన్నారు. గిరి మార్గం రెండు వైపులా స్వచ్ఛత, హరితీకరణ కార్యక్రమాలు చేపట్టి భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించనున్నట్లు తెలిపారు. గిరి ప్రదక్షణ చేసిన ప్రతి భక్తుడికి కైలాసగిరి పుణ్యఫలం దక్కాలని ఆకాంక్షించారు. దేవాలయాలే మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొంటూ, గతంలో జరిగిన నిర్లక్ష్యాలను పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాలక మండలి బాధ్యతాయుతంగా వ్యవహరించి ఆలయ ఆస్తులు, నిధులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.
గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆలయంలో ధర్మ పరిరక్షణకు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని అని తెలిపారు. దేవదాయశాఖ మంత్రి అనంత రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అయ్యప్ప దేవాలయం, లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి ఘాట్ రోడ్డు నిర్మాణం (రూ.3.70 కోట్లు), కోటకుండ–కొత్తపాలెం రోడ్డు (రూ.4 కోట్లు), వాడపల్లి, ఏడు వాగల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి గోదావరి కరకట్ట రోడ్డు (రూ.4 కోట్లు) వంటి పనులు మంజూరయ్యాయని తెలిపారు. ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ నిధులతో సుమారు 22 ప్రధాన దేవాలయాలకు రోడ్లు, వసతి సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. చిన్న ఆలయాలకు కూడా రవాణా సౌకర్యాల అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. కొత్తగా ఎన్నికైన ట్రస్ట్ బోర్డు సభ్యులైన 17 మందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, ఆలయ అభివృద్ధి, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… సుమారుగా 22 కిలోమీటర్లు కలిగిన ఈ గిరిప్రదక్షిణ మార్గం భక్తులందరికీ ఎంతో అనుకూలంగా రోడ్డు పనులను పూర్తి చేసి భక్తులందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. స్వామి అమ్మవార్లు ప్రతి కనుమ పండుగ, శివరాత్రి నాడు గిరిప్రదక్షిణ మార్గాన తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. అదే విధంగా ప్రతి నెల పౌర్ణమి రోజు భక్తుల ఎక్కువ మంది ఈ రోడ్డు మార్గాన్ని ఉపయోగించుంటారు అని అన్నారు. గత శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ఆ ఒక్క రోజునే సుమారు 35 వేల మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేశారన్నారు. అదే విధంగా 22 కిలోమీటర్ల మొత్తానికి భక్తుల సౌకర్యార్థం రాత్రి సమయంలో ఇబ్బందులు కలగకుండా బోర్డు ద్వారా రోడ్డు మార్గానికి స్ట్రీట్ లైట్స్ , మరుగు దొడ్లు, త్రాగు నీటి సదుపాయం, సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2018 సంవత్సరంలో మా నాన్నగారు గిరి ప్రదక్షిణ మార్గమును ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు ఈ పనులను ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరి ప్రదక్షిణ మార్గమును ప్రజలకు అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం సాకారం అయినందుకు డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రివర్యులు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు.
ఆలయ చైర్మన్ మాట్లాడుతూ…
గతంలో గిరిప్రదక్షిణ మార్గాన్ని తిరగాలంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడే వారిని, ఆ కొండ చుట్టు ఈ రోడ్డు మార్గాన్ని వేయడం వలన పెద్ద లక్షల మంది ప్రజలు మార్గాన్ని ఉపయోగించుకుంటున్నారని ఈ మార్గాన్ని ఆ శివుని ఆశీస్సులతో మీ చేతుల మీద ప్రారంభించడం భక్తులు బోర్డు మెంబర్లు చాలా సంతోశిస్తున్నామన్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గిరి ప్రదక్షిణ మార్గమును భక్తులు వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడే వాళ్ళని అలాంటి పరిస్థితిలో గిరి ప్రదక్షణ రోడ్డు మార్గమును భక్తులకు సౌకర్యార్థం అన్ని సౌకర్యాలను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని చాలా సంతోషంగా ఉందని భక్తులు తమ మనోభావాలు తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
_________________________
జిల్లా సమాచార శాఖ తిరుపతి

