కర్నూల్లో బస్సు దగ్ధమైన ఘటనను దృష్టిలో ఉంచుకొని తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం రాత్రి శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తి డిఎస్పి కే.నరసింహమూర్తి, మోటార్ వెహికల్ అధికారి దామోదర్ నాయుడు,శ్రీకాళహస్తి వన్ టౌన్ సీఐ ప్రకాష్ నేతృత్వంలో దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ప్రైవేట్ బస్సు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వాహన పత్రాలు,లగేజ్ పరిమితి,అత్యవసర ద్వారాలు సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అని వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు.

శ్రీకాళహస్తి లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆకస్మిక తనిఖీలు