ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు శనివారం నాగుల చవితి వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమంజన గోపురం వద్ద ఉన్న స్వామివారి రుద్ర పాదాల వద్ద గల నాగశిలలకు వేద పండితులు శాస్త్రోక్తంగా అభిషేకాలు,విశేష పూజలు నిర్వహించారు. అనంతరం దూప,దీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు విశేషంగా పాల్గొని ఆలయ ప్రాంగణంలోని నాగ దేవతలను పూజించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకరన్ గురుకుల్,సూపర్డెంట్ నాగభూషణం,టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, పౌరోహితుడు అర్ధగిరి మరియు దేవస్థానం అధికారులు,సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి లో శాస్త్రోక్తం గా నాగుల చవితి వేడుకలు