*శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారి రాట మహోత్సానికి కలెక్టర్ కు ఆహ్వానం*
*విశాఖపట్టణం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* మార్గశిర మాసోత్సవాల నేపథ్యంలో నవంబర్ 01వ తేదీన జరగనున్న బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి పందిరి రాట మహోత్సవ క్రతువుకు విచ్చేయవల్సిందిగా కోరుతూ ఆలయ అధికారులు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ను సాదరంగా ఆహ్వానించారు. ఆలయ ఈవో కె. శోభారాణి, ఇతర అధికారులు, అర్చకులు కలెక్టర్ను గురువారం సాయంత్రం తన ఛాంబర్లో కలిసి సంప్రదాయ రీతిలో ఆహ్వానం తెలిపారు. దుశ్సాలువాతో సత్కరించి ఆహ్వాన పత్రికను, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. అర్చకులు, వేద పండితులు అక్షితలు చల్లి ఆశ్వీరచనాలు అందజేశారు. కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ సన్నిధిలో నవంబర్ 01వ తేదీన మార్గశిర మాసోత్సవాలకు అంకురార్పణ జరగ్గా నవంబర్ 21 నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.


