Friday, 27 March 2026
  • Home  
  • శ్రిష్టి వరల్డ్ స్కూల్‌లో చిల్డ్రన్స్‌ డే వేడుకలు
- విశాఖపట్నం

శ్రిష్టి వరల్డ్ స్కూల్‌లో చిల్డ్రన్స్‌ డే వేడుకలు

గాజువాక ( ఉక్కు నగరం), నవంబర్(పున్నమి ప్రతినిధి): శ్రిష్టి వరల్డ్ స్కూల్‌లో చిల్డ్రన్స్‌ డే వేడుకలు గురువారం ఉత్సాహభరితంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. “పాపా పాపా జీ” నృత్యంతో ప్రారంభమై, “చాచా నెహ్రూ అండ్ హిస్ లిటిల్ ఫ్లవర్స్” నాటిక, “హ్యాపీ చిల్డ్రన్స్‌ డే” డాన్స్‌ను చిన్నారులు అందించారు. అనంతరం ఫోక్ డాన్స్‌లు, సెమీ-క్లాసికల్ ఫ్యూషన్‌లు, పండుగల ఆధారిత ప్రత్యేక నృత్యాలు విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించాయి. ప్రత్యేకంగా కేరళ ఫోక్ మరియు పంజాబీ బైసాఖీ నృత్యాలు ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. పాఠశాల డైరెక్టర్ సుసీలా రాణి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ, జీవన నైపుణ్యాల పెంపుపై శ్రిష్టి పాఠశాల దృష్టి సారిస్తోందన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. మేఘనా కంభం విద్యార్థుల్లోని ప్రతిభే పాఠశాలకు గర్వకారణమన్నారు. కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ ప్రిన్సిపాల్‌, చీఫ్ అకడమిక్ హెడ్‌, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు హాజరై పిల్లలను అభినందించారు.

గాజువాక ( ఉక్కు నగరం), నవంబర్(పున్నమి ప్రతినిధి):

శ్రిష్టి వరల్డ్ స్కూల్‌లో చిల్డ్రన్స్‌ డే వేడుకలు గురువారం ఉత్సాహభరితంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. “పాపా పాపా జీ” నృత్యంతో ప్రారంభమై, “చాచా నెహ్రూ అండ్ హిస్ లిటిల్ ఫ్లవర్స్” నాటిక, “హ్యాపీ చిల్డ్రన్స్‌ డే” డాన్స్‌ను చిన్నారులు అందించారు. అనంతరం ఫోక్ డాన్స్‌లు, సెమీ-క్లాసికల్ ఫ్యూషన్‌లు, పండుగల ఆధారిత ప్రత్యేక నృత్యాలు విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించాయి. ప్రత్యేకంగా కేరళ ఫోక్ మరియు పంజాబీ బైసాఖీ నృత్యాలు ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి.

పాఠశాల డైరెక్టర్ సుసీలా రాణి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ, జీవన నైపుణ్యాల పెంపుపై శ్రిష్టి పాఠశాల దృష్టి సారిస్తోందన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. మేఘనా కంభం విద్యార్థుల్లోని ప్రతిభే పాఠశాలకు గర్వకారణమన్నారు.

కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ ప్రిన్సిపాల్‌, చీఫ్ అకడమిక్ హెడ్‌, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు హాజరై పిల్లలను అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.